రాయల తెలంగాణ ఉన్మాదుల చర్య: బైరెడ్డి

రాయల తెలంగాణ ఏర్పాటు, భద్రాచలాన్ని సీమాంవూధలో విలీనం చేయాలనే ప్రతిపాదనలు ఉన్మాద చర్యలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌డ్డి అన్నారు. రాజ్యాంగంపై అవగాహన లేని కొంత మంది రాయలసీమ నేతలు తమ స్వార్థం కోసం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్ధీన్ ఓవైసీని ముందు పెట్టి రాయల తెలంగాణ వాదాన్ని తెరపైకి తెచ్చారని బైరెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 10జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు సాధారణ మెజార్టీతో చేపట్టవచ్చని చెప్పారు. శ్రీబాగ్ ఒడంబడిక అమలు కోరుతూ ఈనెల 28, 29 తేదీల్లో ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నట్లు బైరెడ్డి వెల్లడించారు. రాయలసీమ జిల్లాలు కోస్తాంవూధతో కలవడానికి సిద్ధంగా లేవన్నారు.

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.