రాయల తెలంగాణపై భగ్గుమన్న ఓయూ

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయల తెలంగాణ ప్రతిపాదనపై ఓయూ భగ్గుమంది. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుంచి గన్‌పార్క్‌కు ర్యాలీగా బయల్దేరారు. ఓయూలోని ఎన్‌సీసీ గేటు వద్ద విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. పలువురి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయూలో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను విద్యార్థులు దహనం చేశారు. ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులను భారీగా మోహరించారు. ఆంక్షలు లేని పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.