రాయల తెలంగాణను ఒప్పుకోం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌పార్టీ మజ్లిస్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. ఇందులో భాగంగానే రాయల తెలంగాణ ప్రతిపాదనను కాంగ్రెస్‌నేతలు తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పదకొండు వందల మంది బలిదానాలు చేసుకున్నారని, దీనికి కారణం సోనియాగాంధేనని దుయ్యబట్టారు. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.