రాయల తెలంగాణను అంగీకరించం : వినోద్

వరంగల్ : రాయల తెలంగాణ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని టీఆర్‌ఎస్ నేత వినోద్ స్పష్టం చేశారు. తెలంగాణ, సీమ ప్రజలు రాయల తెలంగాణను కోరుకోవడం లేదని తెలిపారు. తెలంగాణను అడ్డుకునేందుకే రాయల తెలంగాణ ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తీసుకొస్తోందని ధ్వజమెత్తారు. సీడబ్ల్యూసీ తీర్మానం మేరకే హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.