రాయల తెలంగాణకు ఒప్పుకోం: పొన్నం

రాయల తెలంగాణకు ఒప్పుకోమని, తెలంగాణలోని అన్ని రాజకీయపార్టీలు ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాయని జీవోఎంకు చెబుదామని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఢిల్లీలో తెలంగాణ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకు తాము ఉద్యమం చేశామన్నారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే తమకు కావాలన్నారు. తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం మంచిది కాదని పొన్నం అన్నారు. వేటకొడవళ్లు, గొడ్డళ్లతో సహవాసం హైదరాబాద్ పద్దతి కాదని మరో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.