రాయల టీ బిల్లు పేరుతో తెలంగాణకు బిస్కెట్

కాంగ్రెస్ తెలంగాణ ఇస్తదనుకుని మురిసిపోయినం. కానీ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతో గేమ్స్ ఆడుతుంది. టీడీపీని, బీజేపీని, వైసీపీని ఇరకాటంలో పెడ్తున్నమనుకుని కాంగ్రెస్ తెలంగాణ ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నది.   అటు ఎంఐఎం, కర్నూలు, అనంతపురం రెడ్డి నేతల ప్రతిపాదన రాయల తెలంగాణను ఇచ్చేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. అటు హైదరాబాద్ పై ఆంక్షలను విధించింది. రాయల తెలంగాణ బిల్లు రూపొందించింది. ఈ బిల్లే రేపు పార్లమెంట్ కు రానుందని ఏఐసీసీ వర్గాలు చెప్తున్నయి. రాయల బిల్లు పార్లమెంట్ కు వస్తే బీజేపీ వ్యతిరేకిస్తుంది. టీఆర్ఎస్ వ్యతిరేకిస్తది. బిల్లులో సవరణల పేరుతో వింటర్ సెషన్స్ ను ముగించాలన్న యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు విశ్లేషకులంటున్నరు.  కాంగ్రెస్ రాయల టీ పేరుతో తెలంగాణ పని బిస్కెట్ చేస్తున్నది.

ఇప్పటికే టీ కాంగ్రెస్ నేతలు రాయల తెలంగాణకు ఒప్పుకున్నరని అధిష్టానం చెప్తున్నది. రెడ్డోళ్లు పెరుగుతరని రెడ్డినేతలు, ముస్లింలు పెరుగుతరని ఎంఐఎం  నేతలు రాయల తెలంగాణకు కమిట్ అయ్యారు. ఎంత కులపోళ్లైనా వాళ్లు సీమవాళ్లన్న విషయాన్ని నేతలు మర్చిపోతున్నరు. గతంలో రెడ్డి, బ్రాహ్మిణ్స్ కూడా ఇట్లనే అనుకుని ఆంధ్రాలో కలిపి తెలంగాణను సర్వనాశనం చేసిన్రు.

తెలంగాణ ప్రజలు మరోపోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. డిసెంబర్ 5 నుంచే పార్లమెంట్ సమావేశాలున్నయి. జేఏసీ, టీఆర్ఎస్ ఉద్యమకార్యాచరణ రూపొందించకుంటే ఇన్నిరోజుల పోరాటం వేస్ట్ అవుతది. ఇన్నిరోజులు ఓపికపట్టినం వాళ్లు అసెంబ్లీకి ముసాయిదా పంపేదాక చూద్దామని ఊరుకుంటే రాయలకు ఒప్పుకున్నమనుకొని మన నోట్లె మట్టికొడ్తరు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.