రాధాకృష్ణ.. కొజ్జాగానివి కాకపోతే కేటీఆర్‌ సవాల్ స్వీకరించు-బాల్క సుమన్‌

చంద్రబాబుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పెంపుడు కుక్కలా వ్యవహరిస్తున్నారని, తెలంగాణలో కూలిపోయిన టీడీపీని మళ్లీ లేపే క్రమంలో విశ్వాసం చూపిస్తున్నారని టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు 12ఎంపీ స్థానాలు వస్తాయన్న జాతీయ సర్వేలు చూసి తట్టుకోలేకే, కుక్కలామారి విశ్వాసం చూపుతూ తెలంగాణ ఉద్యమంపై, కేసీఆర్ కుటుంబంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు, ఏబీఎన్ చానల్ రాధాకృష్ణ మగాళ్లైతే.. కొజ్జాగాళ్లు కాకుంటే కేటీఆర్ చేసిన సవాల్‌కు సిద్ధం కావాలన్నారు. కేసీఆర్ చిన్ననాటినుంచి ఆస్తుల విచారణకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారని, అదే తీరులో చంద్రబాబు, రాధాకృష ్ణసిద్ధమేనా అని అన్నారు. చందాల పార్టీ టీడీపీయేనని టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు రాములనాయక్ అన్నారు. కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.