రాధాకృష్ణపై కేటీఆర్ పరువు నష్టం దావా

టీఆర్‌ఎస్ పార్టీ, ఆపార్టీ నేతలపై పిచ్చిరాతలు రాస్తూ, పిచ్చి కూతలు కూస్తోన్న ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎస్ ఛానెల్‌పై ఇవాళ పరువు నష్టం దావా నమోదైంది. ఆ సంస్థల ఎండీ రాధాకృష్ణపై ఇవాళ నాంపల్లిలోని క్రిమినల్ కోర్టులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు పరువు నష్టం దావా వేశారు. ఐపీసీ సెక్షన్-499, 500ల కింద కేసు నమోదు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఏ-1గా ఆమోద బ్రాడ్‌కాస్టింగ్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కనగంటి వేంకటశేషగిరిరావు, ఏ-4గా ఎడిటర్ శ్రీనివాస్‌లను నిందితులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రజాప్రతినిధిగా ఉన్న తమను వ్యక్తి గతంగా దూషిస్తూ తమ పరువును, పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ వార్తా సంస్థలు వ్యవహరించాయని పిటిషన్‌లో ఆరోపించారు. పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. రాధాకృష్ణ తమపై కావాలనే విషం చిమ్ముతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, న్యాయస్థానంలో న్యాయం దొరుకుతోందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంపై ఆంధ్రజ్యోతి విషం చిమ్ముతోందని, నిరాదారమైన ఆరోపణలు చేస్తూ ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు కుట్ర పన్నుతోందని అన్నారు. ఉధృతంగా ఉన్న ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. ఇంకోసారి ఇలాంటి రాతలు రాస్తమంటే ఊరుకోబోమని అన్నారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.