రాధాకృష్ణకు శాస్తి తప్పదు: టీ అడ్వకేట్ జేఏసీ

టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఆరాటపడుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు తెలంగాణవాదుల చేతుల్లో తగిన శాస్తి తప్పదని టీ అడ్వకేట్ జేఏసీ ప్రకటించింది. ఆదివారం నాంపల్లి క్రిమినల్ కోర్టులో సమావేశమైన టీ అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు.. తెలంగాణవాదులు రాధాకృష్ణను తరిమికొట్టాలని తీర్మానం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా సెటిల్‌మెంట్ల ద్వారా సంపాదించిన అక్రమ సంపాదనను ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో పెట్టుబడి పెట్టాడని, ఆ రుణం తీర్చుకోవడానికే తెలంగాణవాదులపై అసత్య కథనాలను అల్లుతున్నాడని టీ అడ్వకేట్ జేఏసీ ఆరోపించింది. ఈ సమావేశంలో కొంతం గోవర్ధన్‌డ్డి, రాజేశ్వర్‌రావు, సురేఖసింగ్, శ్రీధర్‌డ్డి, బ్రహ్మానందడ్డి, ఉపేంద్ర, సి గోవర్ధన్‌డ్డి, జనార్థన్‌గౌడ్ పాల్గొన్నారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.