రాజ్‌ఘాట్‌లో టీ జేఏసీ మౌన ప్రార్థన

న్యూఢిల్లీ, డిసెంబర్ 3 :ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని, యువతీయువకు ల బలిదానాలను అపహాస్యం చేస్తూ కేంద్రం రాయల తెలంగాణ నిర్ణయాన్ని తీసుకోనున్నదనే వార్తల నేపథ్యంలో ఆ ప్రతిపాదనపై శాంతియుతంగా పోరాటాన్ని కొనసాగించే తెలంగాణ ప్రజలకు శక్తినివ్వాలని మహాత్మాగాంధీని ప్రార్థించామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. మంగళవారం టీజేఏసీ బృందం రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద గంటపాటు రాయల తెలంగాణకు నిరసనగా ‘తెలంగాణ ప్రార్థన’ చేశారు. అనంతరం మల్లేపల్లి లక్ష్మయ్య, దేవీవూపసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్ తదితరులతో కలిసి కోదండరాం విలేకరులతో మాట్లాడారు. మహాత్మాగాంధీ బాటలో స్వరాష్ట్రం కోసం తెలంగాణ పోరాటం నడుస్తున్నదన్నారు. తెలంగాణ యువతీ యువకులు తమ ప్రాణాలను తాము బలిదానాలు చేసుకున్నారు తప్పితే ఎవరినీ హింసించలేదన్నారు. రాయల ప్రతిపాదనను టీజేఏసీ నిర్దంద్వంగా తిరస్కరిస్తున్నదని స్పష్టం చేశారు. కేంద్రం మొండిగా వెళితే మరో పోరాటానికి తెలంగాణ ప్రజలు సిద్ధపడతారని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. ఆ పోరాటాలు గతంకంటే ఉధృతంగా ఉంటాయని చెప్పారు. అందుకే గాంధీ సమాధి వద్ద మౌన ప్రార్థన చేపట్టినట్లు కోదండరాం తెలిపారు. ఈ కార్యక్షికమం అనంతరం వారు సీపీఐ, బీజేపీ, జనతాదళ్(యూ) నాయకులతో సమావేశమయ్యారు.

తెలంగాణకు ఆటంకం కలిగించాలనే: సురవరం
తెలంగాణను అడ్డుకోవాలనే యోచనతోనే యూపీఏ రోజుకో విధంగా మాట్లాడుతున్నదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సువరం సుధాకర్‌డ్డి విమర్శించారు. అందులో భాగంగానే రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చారని అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను పార్లమెంటులో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. టీజేఏసీ నేతలు సురవరాన్ని సీపీఐ కేంద్ర కార్యాలయం అజయ్‌భవన్‌లో కలిశారు.

ఎట్టి పరిస్ధితుల్లో ఒప్పుకోం: రాజ్‌నాథ్
పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయానికి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంటులో మద్దతు తెలిపే ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తనను కలిసిన టీజేఏసీ నాయకత్వానికి స్పష్టం చేశారు. సీఎం వైఖరి ఎలా ఉందని రాజ్‌నాథ్ తమను ప్రశ్నించారని, ఆయన సీమాంవూధులకు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని వివరించామని జేఏసీ నేత విఠల్ తెలిపారు. తెలంగాణ కు మెదటి నుంచి మద్దతునిస్తున్న బీజేపీ.. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సంపూర్ణ మద్దతునిస్తుందని పూర్తి విశ్వాసం తమకు ఉందని తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసే విధంగా పార్లమెంటులో బిల్లుపై చర్చ జరిగేలా చూడాలని, ఇందుకు కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని కోరగా రాజ్‌నాథ్ సానుకూలంగా స్పందించారని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి తెలిపారు.

హస్తినలో బిజీబిజీగా టీజేఏసీ నేతలు
రెండు రోజులుగా ఢిల్లీలో జాతీయ పార్టీలను కలిసి రాయల తెలంగాణకు ఒప్పుకోవద్దని కోరుతూ టీజేఏసీ జరిపిన జరిపిన సమావేశాలు ముగిశాయి. వీలయితే అన్నాడీఎంకే అధినేత్రి జతయలలిత, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో సహా ఇతర ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలను కలుస్తామని కోదండరాం చెప్పారు. రాయల తెలంగాణను నిరసిస్తూ టీఆర్‌ఎస్ 5న బంద్‌కు పిలుపిచ్చిన నేపథ్యంలో జేఏసీ స్టీరింగ్ కమిటీ బుధవారం ఉదయం 9 గంటలకు ఏపీ భవన్‌లో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నది. బుధవారం నాటి వివిధ కార్యక్షికమాల్లో పాల్గొన్నవారిలో టీ జేఏసీ నేతలు దేవీవూపసాద్, మల్లేపల్లి లక్ష్యయ్య, విఠల్, శ్రీనివాస్ గౌడ్, అద్దంకి దయాకర్, పిట్టల రవీందర్, అడ్వొకేట్ జేఏసీ నేతలు రాజేందర్ రెడ్డి, ప్రహ్లాద్, లింగం యాదవ్. విద్యుత్ ఉద్యోగుల నేతలు రఘు, శివాజీ, టీజీవో నేతలు ఏలూరి శ్రీనివాస్, ఉద్యోగుల సంఘం నేతలు మామిడి నారాయణ, పవన్‌గౌడ్, సత్యగౌడ్, రెవిన్యూ సంఘం నేతలు శివశంకర్, అంజయ్య, జంగయ్య, సంపత్, వెంకట్‌డ్డి, డాక్టర్ల జేఏసీ నేతలు సురేశ్ హరి, కనకరాజు, ఇంజినీరింగ్ జేఏసీ నేతలు వెంక బాలనర్సయ్య, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు దీక్షంత్ రెడ్డి, నాలుగవ తరగతి ఉద్యోగుల జేఏసీ నేత జ్ఞానేశ్వర్, పాలిటెక్నిక్ జేఏసీ నేత మురళీధర్ గుప్తా, డొంకెన రవి, మోహన్, తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్యం తదితరులున్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.