రాజ్యాంగ బద్ధంగానే తెలంగాణ ఏర్పాటు: గండ్ర

హైదరాబాద్: రాజ్యంగ బద్ధంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. తెలంగాణకు మద్దతిస్తామని చంద్రబాబు, కేంద్రం నిర్ణయం తీసుకుంటే అమలు చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. టీ బిల్లుపై చర్చ సందర్భంగా గండ్ర అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రతి అంశంలో తెలంగాణ వివక్షకు గురైందన్నారు. తెలంగాణ ప్రజలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించారు. విశాలాంధ్ర ఏర్పడ్డాక ఇచ్చిన హామీలంటినీ తుంగలో తొక్కారు. నీలం సంజీవరెడ్డి తొలిసారిగా ఒప్పందాన్ని ఉల్లంఘించారని తెలిపారు. ఒప్పందాలన్ని ఉల్లంఘించినందుకే తెలంగాణ ఉద్యమం వచ్చిందన్నారు. హిందీ భాషను మాట్లాడే రాష్ట్రాలు దేశంలో ఎన్నో ఉండగా తెలుగు మాట్లాడే ప్రజలకు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేందని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం ఎన్నో సంప్రదింపులు చేశాకే ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.