రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ ప్రక్రియ: పీసీ చాకో

సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రధాని మన్మోహన్‌కు రాసిన లేఖను తాము పట్టించుకోవడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో చెప్పారు.

సీఎం కంటే ఎక్కువగా ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం గురించి తెలుసని సోమవారం ఆయన ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. తెలంగాణ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి విభేదించడంలో కొత్తేమీ లేదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు ప్రధాని, ఇతర నేతలు రాజ్యాంగాన్ని అనుసరించే వెళుతున్నారని చాకో స్పష్టం చేశారు. యాభై ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని, నలుగుతున్న తెలంగాణ సమస్యకు కాంగ్రెస్ పార్టీ పరిష్కారం చూపగలిగిందని అన్నారు. మిగిలిన ఏ పార్టీలూ ఆ పని చేయలేక పోయాయని చెప్పారు. తెలంగాణ నిర్ణయంపై తమ పార్టీలో భేదాభివూపాయాలు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. ఈ విషయంలో తమ పార్టీ రాష్ట్ర నేతలు రెండు ప్రాంతాలుగా విడిపోయారని చెప్పారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల అభివూపాయాలు రహస్యమేమీ కాదని వ్యాఖ్యానించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.