రాజ్యసభలో 12న తెలంగాణ ప్రకటన: రాజీవ్‌శుక్లా

న్యూఢిల్లీ: హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఈనెల 12న తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నారు. ఈమేరకు ఇవాళ రాజ్యసభలో కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుపై హోం మంత్రితో ప్రకటన చేయించాలని టీడీపీ ఎంపీలు ఇవాళ రాజ్యసభలో ఆందోళనకు దిగారు. వీళ్లకు మద్దతుగా బీజేపీ సభ్యుడు అరుణ్‌జైట్లీ మాట్లాడారు. తెలంగాణ ప్రకటన చేయించాల్సిందేనని జైట్లీ పట్టుబట్టారు. దీంతో సోమవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక హోంమంత్రి తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తారని రాజీవ్‌శుక్లా సభకు తెలిపారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.