– అసోం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాల సమర్పణ
రాజ్యసభ స్థానానికి ప్రధాని మన్మోహన్సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం అసోం రాజధాని గువాహటిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ ప్రిన్సిపల్ కార్యదర్శి జీపీ దాస్‌కు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. 21 ఏళ్లుగా అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మన్మోహన్.. ఐదో పర్యాయం కూడా ఇక్కడినుంచే నామినేషన్ సమర్పించారు. ఈ మేరకు 40మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఎన్నికల అధికారికి అందజేశారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. మన్మోహన్ రాజ్యసభ పదవీకాలం జూన్ 14తో ముగిసిపోనుంది. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో క్లుప్లంగా మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరిస్తున్న అసోం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అసోంలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం మే 13న నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికలు మే 30న జరగనున్నాయి.
చిల్లిగవ్వ లేదు.. అఫిడవిట్లో ప్రధాని
ప్రధాని చేతిలో చిల్లిగవ్వ కూడా లేదట. అసోం నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న ప్రధాని బుధవారం నామినేషన్ పత్రాలతోపాటు ఆస్తుల అఫిడవిట్ సమర్పించారు. అందులో ఏటా రూ.4.5లక్షల ఆదాయం వస్తుందని.. ప్రస్తుతం ఆయన భార్య వద్ద రూ.20 వేలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో లక్షలు విలువజేసే కార్లు లక్షల్లో తిరుగుతున్నా.. ఆయన కారు విలువ మాత్రం రూ.21,033 మాత్రమే. సింగ్‌కు చరాస్తులు 38,763,188ఉన్నాయి. సింగ్ భార్య గురుశరణ్‌కౌర్ పేరిట రూ.2,031,385 ఆస్తులు ఉన్నాయి. ప్రధానికి రెండంతస్థుల ఇళ్లు రెండు ఉన్నాయి. వీటి విలువ రూ.7,52,50,000. ప్రధాని అసోంలోని ఇంటికి ఇస్తున్న అద్దె నెలకు రూ.700మావూతమే కావడం విశేషం.