రాజ్యసభకు తెలంగాణ కారు..

తొలిసారిగా రాజ్యసభకు టీఆర్ఎస్ కారు వెళ్తున్నది. రాజ్యసభ అభ్యర్థిగా కేకే విజయం సాధించారు.  తనను రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలబెట్టి గెలిపించినందుకు టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆపార్టీ అభ్యర్థి కే కేశవరావు కృతజ్ఞతలు తెలిపారు. ‘కేసీఆర్‌కు నా మొదటి కృతజ్ఞతలు, నాకు ఓటు వేసిన సీపీఐ మిత్రులకు ధన్యావాదాలు’ అని స్పష్టం చేశారు. ఇవాళే తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, తాను రాజ్యసభకు ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇకపై తెలంగాణ బిల్లు ఆమోదం పోందేలా పార్లమెంట్‌లో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

This entry was posted in Top Stories.

Comments are closed.