రాజీనామా చేసే ప్రసక్తే లేదు : శ్రీనివాసన్

కోల్‌కతా : బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదని తేల్చిచెప్పారు. స్పాట్ ఫిక్సింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీనివాసన్ స్పష్టం చేశారు. ఫిక్సింగ్ వ్యవహారంపై ఆవేదన చెందానని తెలిపారు. బీసీసీఐ చీఫ్‌గా తనను రాజీనామా చేయమని ఎవరూ అడగలేదని తేల్చిచెప్పారు. బీసీసీఐలో తనకు పూర్తి మద్దతు ఉందన్నారు. విధుల్లో తాను ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా తాను అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో నిందితులపై బీసీసీఐ కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గురునాథన్‌ను సస్పెండ్ చేశామని తెలిపారు. దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. గురునాథ్ వ్యవహారంపై దర్యాప్తు కమిటీ వేశామని పేర్కొన్నారు. గురునాథ్‌పై న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని తెలిపారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.