రాజీకాని రామిరెడ్డి

తెలంగాణ ఉద్యమ చరిత్ర మొదలైనప్పుడే తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు, పదవీ త్యాగాలు కూడా మొదలైనవి. అలా 1969 తెలంగాణ ఉద్యమంలో తన పదవికి రాజీనామా చేసి తెలంగాణనే ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తి గుండా రామిడ్డి. ఆయన కమర్షియల్ సేల్స్ టాక్స్ ఆఫీసర్‌గా తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత తెలంగాణ రామిడ్డి అనే పేరు స్థిరపడిపోయింది. ఇప్పటికీ ఆ పెద్దాయన్ని ‘గుండా రామిడ్డి’ అని ఇంటిపేరుతో అడిగితే ఎవరూ గుర్తించరు. తెలంగాణ రామిడ్డి అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు. ఆయనది కూడా అన్యాయానికి, అణిచివేతకు గురైన కథనే. అందుకే ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం తృణవూపాయంగా వదిలేశాడు.

195 జనవరి 27న గుండా రామిడ్డి రాజీనామా లెటర్ ఇచ్చాడు. ముప్పయి ఆరేళ్ల వయసులో, ఉద్యోగంలో పద్దెనిమిదేళ్ల సర్వీస్ మిగిలి ఉండగానే ఆయన రాజీనామా చేశాడు. కారణం ఒక్కటే… 1956లో తెలంగాణ బలంతంగా ఆంధ్రలో కలిపేసిన తరువాత తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో అనేక మార్పులు జరిగాయి. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో భారీ పరిణామాలు సంభవించాయి. అప్పటికి రామిడ్డి సేల్స్‌టాక్స్ డిపార్ట్‌మెంట్, మహబూబ్‌నగర్‌లో పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత, ఆంధ్రపెత్తనం, వాళ్ల వలసలు ఎలా మొదలయ్యాయో కళ్లారా చూశాడు. తెలంగాణలో ఉన్న సీనియర్ అధికారులను ఆంధ్రకు పంపించి ఆంధ్రలోని జూనియర్స్‌కు ప్రమోషన్ ఇచ్చి తెలంగాణకు రప్పించారు. ఏసీటీవోగా ఉన్న ఆంధ్రవాళ్లను సీటీవోగా ప్రమోషన్‌లు ఇచ్చి ఇక్కడికి రప్పించారు. ఆంధ్రోళ్లకు గెజిటెడ్ సీటీవో అని కొత్త హోదాను తెచ్చిపెట్టుకున్నారు. తెలంగాణలో సీనియర్ ఆఫీసర్స్‌కు సమాన స్థాయిలో ఆంధ్రలోని జూనియర్స్‌కు జీతాలు ఇచ్చేవారు. ఈ పరిణామాలన్నీ స్వయంగా చూశాడు రామిడ్డి. సిస్టమ్‌తో పోరాటం చేయాలనుకున్నాడు. కానీ పెత్తనమంతా వాళ్లది. అధికారాలు, పదవులూ అన్నీ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. అందుకే మనస్తాపాన్ని తన రాజీనామా లెటర్‌తో చల్లబరుచుకున్నాడు. తెలంగాణ కోసం రాజీనామా చేయడం ఆయనకు ఆనందాన్నిచ్చింది తప్ప ప్రభుత్వ ఉద్యోగం కోల్పోతున్నాననే బాధ మాత్రం ఎప్పుడూ కలగలేదు. అందుకే ఎలాంటి వివాదాలు, విమర్శలు ఎదుర్కోని రామిడ్డి ధైర్యంగా రాజీనామ ఇవ్వగలిగాడు.నిజానికి రామిడ్డి అధికారుల దగ్గర పరపతి కలిగిన వ్యక్తి.

ఆయన తలుచుకుంటే తన జీతం, ప్రమోషన్ అన్నీ ఒక్క చిటికెలో అయ్యేవి. ఆంధ్రోళ్ల దగ్గర చేయిచాచడం ఆయనకు నచ్చలేదు. అంతేకాదు డిప్యూటీ సీఎంగా పనిచేసిన కె.వి.రంగాడ్డికి అత్యంత ఆప్తుడు రామిడ్డి. ఆయనింట్లోనే ఉండేవాడు. రాజీనామా చేసినప్పుడు కూడా కె.వి.రంగాడ్డి వంటి పెద్దవాళ్లు వారించినా ఆయన వినలేదు. ఇలాంటి వివక్షను భరించడం కన్నా ఆ ఉద్యోగంలో నుంచి బయటకు రావడమే బెటర్ అని చెప్పేవాడు. ఇంకో విశేషం ఏమిటంటే… రామిడ్డి రాజీనామాను గవర్నమెంట్ అంగీకరించలేదు. పదిహేను నెలలు పెండింగ్‌లో ఉంచింది. ప్రమోషన్ ఇవ్వజూపింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉద్యోగంలో చేరిపోవచ్చనే ఆఫరూ ఇచ్చింది కానీ ఆయన మాత్రం దేనికీ చలించలేదు.సేల్స్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఉద్యోగానికి రాజీనామా చేసింది ఆయనొక్కడే. ఆ వార్త తెలిసిన తరువాత ఆయనకు ప్రజల్లో, తోటివాళ్లలో ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. ఎక్కడికెళ్లినా గౌరవమర్యాదలు లభించాయి. తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని అందరూ గౌరవించారు. ఆయన ఇమేజ్ ఏ రేంజ్‌కు వెళ్లిందంటే… ఎమ్మెల్సీగా ఎన్నికవడం దాకా. 196లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రముఖుల సలహాలు, సూచనల మేరకు రామిడ్డి పోటీ చేశాడు.

అయితే అప్పుడు కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండేది జనసంఘ్, కమ్యూనిస్టు పార్టీల్లో. వాళ్లంతా రామిడ్డి మీద ఉన్న మంచి అభివూపాయం, ఏ మచ్చ లేని ఆయన ప్రొఫైల్ చూసి మద్దతిచ్చారు. నల్గొండ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన రామిడ్డికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి తెలంగాణ కోసం ఉద్యోగ త్యాగం చేసిన మనిషిగా గౌరవించి గెలిపించారు. ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఆయనకున్న పరిధి మేరకు తెలంగాణ కోసం తన గొంతు వినిపించాడు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వివిధ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయి కానీ ఆయన ఏ పార్టీలోకి వెళ్లలేదు. పీవీ నరసింహరావు క్లాస్‌మేట్, గొప్ప నాయకులతో అనుబంధమూ ఉన్న రామిడ్డి ఎప్పుడూ ఎవరినీ ఏమడగలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత చాలా సంవత్సరాలు వరంగల్‌లోని ‘తెలంగాణ హైబ్రీడ్ సీడ్ కంపెనీ’లో మేనేజర్‌గా పనిచేశాడు. కుటుంబం, పిల్లలు… బాధ్యతలు అన్నిటినీ చక్కబెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు ఎమ్మెల్సీ పెన్షన్ వస్తుంది. రామిడ్డికి నలుగురు పిల్లలు. తొంభై ఆరేళ్ల రామిడ్డికి ఇప్పటికీ ఓ నమ్మకం… ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం తారాస్థాయిలో ఉంది. తెలంగాణ వచ్చి తీరుతుందని!

This entry was posted in TELANGANA MONAGALLU.

Comments are closed.