రాజాజీలాగా సీమాంవూధులను గెంటివేయాల్సిందే-కేసీఆర్‌

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు kcrrr– ఎన్నికల తర్వాత రాష్ట్రం వచ్చి తీరుతుంది
– ఉద్యోగులపై ఈగ వాలినా సహించం
– ‘హ్యాండ్‌బుక్’ ఆవిష్కరణ సభలో కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం లేదని, ఆ చాప్టర్ ఓవర్ అని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఇం దిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ అసోసియేషన్ హ్యాండ్‌బుక్‌ను ఆయన ఆవిష్కరించి ప్రసంగించారు.

‘యూపీఏ ప్రభుత్వం వెంటిలేటర్‌పై నడుస్తోంది. మొండి, మూర్ఖ త్వ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను గుర్తించ కాంగ్రెస్ నేతలు చవటలు, సన్నాసులు. ఎన్నికల తర్వాత నూటి కి నూరుపాళ్లు తెలంగాణ వస్తుంది. తెలంగాణ వనరులను తినమరిగినవాళ్లు మంచి మాటలతో వెళ్లమంటే ఎందుకు వెళ్తరు. తమిళనాడులో రాజాజీలాగా సీమాంవూధులను పంపించి వేయాల్సి వస్తుంది. ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై మూల్యం చెల్లించుకోవద్దా? తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రలోభాలకు ఎందుకు లోనవుతారు? సన్నాసులు, చవటలు… తిడితే తిట్టామంటారు. ఆ తిట్లకు మీరే పేరు పెట్టుకోం డి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్‌ను కాం గ్రెస్‌లో విలీనం చేస్తామన్నాం. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ ఇవ్వాలని అడిగాం. టీఆర్‌ఎస్‌కు అద్భుతమైన ఫలితాలు వచ్చే పరిస్థితులున్నా యి. నాయకుల భవిష్యత్తును ఫణంగా పెట్టి మరీ విలీనానికి ఒప్పుకొన్నాం. అయినా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వటానికి ముందుకు రావ తెలంగాణను ఎవ రూ ఆపలేరు. అలా అనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది. ఇంత దూరం వచ్చిన తరువాత తెలంగాణ ఆగుతదా. తెలంగాణను నిండా ముంచింది నెహ్రూనే. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులకు భిన్నంగా పోవడమే సమస్యకు కారణం.

తెలంగాణ ఇవ్వాలని అడిగితే ఇం దిరాగాంధీ ఉద్యమకారులను పిట్టలను కాల్చినట్టు కాల్చివేయించి చంపించింది. సోనియాగాంధీ అనేక ఏళ్లుగా రాచి రంపాన పెడుతోంది. విజ్ఞతతో విడిపోదామని చాలాసార్లు ఆంధ్రోళ్లకు విజ్ఞప్తులు చేశాం.. ఆంధ్ర లో మేధావులు ఉన్నారో? చచ్చారో? వారి మాట అక్క డి నాయకులు వింటారో? లేదో? తెలియదు. నాకు స్పష్టమైన సమాచారం ఉంది. 2014లో తెలంగాణ వచ్చి తీరుతది. లేదంటే ఎన్నికల తర్వాత ఎలాగైనా సాధిస్తాం. ఉద్యోగులపై ఈగ వాలినా సహించేది లేదు. రకరకాల సర్వీసుల పేర ఉద్యోగులను గందరగోళానికి గురి చేసే ప్రస్తుత సర్వీస్ రూల్స్‌ను తెలంగాణ రాష్ట్రం లో స్క్రాప్ చేసేస్తాం. స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖ ద్వారా ఆదాయం 6 వేల కోట్లు వస్తుంటే, అందులో అరవై శాతం తెలంగాణ నుంచే వస్తోంది. సొమ్ము ఎవరిది? సోకు ఎవరిది? ఏసీబీ దాడులు చేయిస్తూ ఉద్యోగులను . ఉద్యోగుల జోలికి వస్తే పెన్‌డౌన్ చేస్తాం. ఏసీబీ నుంచి ఆదాయానికి మించి ఆస్తుల నిబంధనను తొలగించాలి. ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనే కొత్త చట్టాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. ల్యాండ్ మాఫియాకు ఊతమిస్తోంది. ఏ ఉద్యోగినైనా వేధిస్తే సమాచారం ఇవ్వండి. చర్యలు తీసుకున్నా తెలంగాణ రాష్ట్రం లో ఇంక్రిమెంట్లు ఇచ్చి డబుల్ ప్రమోషన్లు కల్పిస్తా’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

సీబీఐ వల్లే యూపీఏ నడుస్తోంది
యూపీఏ ప్రభుత్వం సీబీఐ వల్లే నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. సీబీఐని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తూ యూపీఏ మనుగడ సాగిస్తోందని ధ్వజ మెత్తారు. జేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ సం ఘటిత శక్తి ఉద్యోగులను కాపాడుతోందన్నారు. తెలంగాణ కోసం పోరాడితే టీ మంత్రులకు పేరొచ్చేదని, భిన్నంగా వెళ్లటం వల్లే జైళ్లు దిక్కవుతున్నాయన్నారు. వైఎస్ హయాంలో చక్రం తిప్పిన కేవీపీని ఎందుకు అరెస్టు చేయలేదు అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీల మద్దతు అవసరం లేదని, తెలంగాణను తెచ్చుకునే శక్తి తమకుందని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన టీజీవో అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీవూపసాద్‌రావు, ప్రధాన కార్యదర్శి కే రవీందర్‌డ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్, అద్దంకి దయాకర్, ఏలూరి శ్రీనివాసరావు, విష్ణువర్ధన్‌రావు, సహదేవ్, అశోక్, పాండురంగారావు, ఎంబీ కృష్ణాయాదవ్, ముజీబ్, సత్యనారాయణ, మామిడి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.