రాజస్థాన్, ఢిల్లీ కోటల్లోనూ పాగా వేయాలి: సుష్మా

రానున్న ఎన్నికల్లో మధ్యవూపదేశ్, ఛత్తీస్‌గఢ్‌లను నిలబెట్టుకోవడమే కాదు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఢిల్లీలో కూడా బీజేపీ కైవసం చేసుకోవాలని పార్టీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ సూచించారు. అస్థిరత్వంతో సతమతమవుతున్న కర్ణాటక, జార్ఖండ్‌లలో సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పాల్సి ఉందన్నారు. బీజేపీ జాతీయ మండలి భేటీలో ఆమె మాట్లాడారు. అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ మరో నేత రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణాన్ని మరుగున పడేయాలని సర్కారు చూస్తోందని ఆరోపించారు. పార్టీ సీనియర్ నేత గోపీనాథ్‌ముండే మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదం వంటి సమస్యలను పరిష్కరించడంలో యూపీఏ విఫలమైందన్నారు. కాగా, అద్వానీ పాకిస్థాన్‌లోనే ఉండి.. అక్కడ దీనస్థితిలో ఉన్న హిందువులకు సేవ చేయాల్సి ఉండేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. ఇవి కాంగ్రెస్ అధికారికంగా చేసిన వ్యాఖ్యలేనా? అని బీజేపీ నేత రవిశంకర్‌వూపసాద్ సోనియాను ప్రశ్నించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.