రాజధానిలో తెలంగాణ రణభేరి-జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ

 

TJAC-protest
రోజుల తెలంగాణ సత్యాక్షిగహ దీక్ష గ్రాండ్ సక్సెస్
కదిలివచ్చి… మద్దతు పలికిన జాతీయ నాయకత్వం
పార్లమెంటు ముట్టడికి
తెలంగాణవాదుల యత్నం
అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
ఇక చలోఅసెంబ్లీకి హైదరాబాద్ పోదాం
సంసద్ యాత్ర స్ఫూర్తితో
విజయవంతం చేద్దాం
టీజేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపు
తెలంగాణ ఇవ్వకుంటే
యూపీఏకే నష్టం
‘బయ్యారం’పై సీఎం
తెలివితక్కువ నిర్ణయం
తరలింపును
ఎలా అడ్డుకోవాలో
మాకు తెలుసు
దీక్ష ముగింపులో
టీజేఏసీ చైర్మన్
యూపీఏ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ఆఖరి ప్రయత్నంగా టీ జేఏసీ ఢిల్లీలో నిర్వహించిన రెండు రోజుల సత్యాక్షిగహ దీక్ష గ్రాండ్ సక్సెస్ అయింది. తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు యావత్ జాతీయ నాయకత్వం సంఘీభావం ప్రకటించింది. సంసద్ యాత్రతో ఉద్యమస్ఫూర్తిని నిలు నింపుకున్న తెలంగాణ శ్రేణులు.. రెట్టించిన ఉత్సాహంతో తిరుగువూపయాణమయ్యారు. సంసద్‌యాత్ర కోసం ఢిల్లీ వచ్చిన ‘తెలంగాణ ఎక్స్‌వూపెస్’.. ఇప్పుడు చలో అసెంబ్లీ కోసం కూత వేసుకుంటూ హైదరాబాద్ బయల్దేరింది. ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలుపుకోకపోతే.. నష్టపోయేది వాళ్లేనని దీక్ష ముగింపు సందర్భంగా మాట్లాడిన టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. ‘ఈ పార్లమెంటు సమావేశాల్లోపల తెలంగాణను ప్రకటిస్తే మంచిది. తరువాత నిర్ణయం తీసుకున్నా ప్రయోజనముండదు’ అని చెప్పారు. తెలంగాణ వచ్చే వరకు జేఏసీ పోరాటం ఆగదన్నారు. తెలంగాణ సమాజం మొత్తం చలో అసెంబ్లీకి తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. దీక్ష ముగిసిన తర్వాత ర్యాలీగా బయలుదేరిన జేఏసీ కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకుపోవడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బారికేడ్లు దాటేక్షికమంలో పలువురు విద్యార్థి, అడ్వకేట్ నేతలకు గాయాలయ్యాయి. కాగా.. దీక్షావేదిక వద్దకువచ్చిన బీజేపీ నేత సుష్మాస్వరాజ్.. వెయ్యి మంది యువత శవాలను కండ్ల చూసిన కాంగ్రెస్ ఇంకా ఎన్ని చావులు చూడాలనుకుంటోందని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి రాగానే వంద రోజుల్లో తెలంగాణ ప్రకటిస్తామని పునరుద్ఘాటించారు.
susma
తెలంగాణ రాష్ట్రం ప్రకటించి మాట తప్పిన యూపీఏ కళ్లు తెరిపించేందుకు ఆఖరి ప్రయత్నంగా ఢిల్లీలో టీజేఏసీ చేపట్టిన రెండు రోజుల సత్యాక్షిగహ దీక్ష మంగళవారంతో ముగిసింది. రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ నుండి ‘తెలంగాణ ఎక్స్‌వూపెస్’ తిరిగి హైద్రాబాద్‌కు బయల్దేరింది. సంసద్ యాత్ర ముగించుకుని ఢిల్లీ నుంచి హైద్రాబాద్ బయల్దేరే రైలును ‘తేదీ నిర్ణయించని, త్వరలో నిర్వహించే ‘ఛలో అసెంబ్లీ’కి బయలుదేరే రైలు’గా టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అభివర్ణించారు. దీక్ష ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సంసద్ యాత్ర ద్వారా మీరేం సాధించిండ్రు? కాంగ్రెస్ తెలంగాణ ఇస్తదనే విశ్వాసం ఇప్పటికీ మీకు ఉన్నదా? అని మీడియా వాల్లు నన్ను అడుగుతున్నరు. వాల్లకొక్కటే నేను చెప్పదలుచుకున్న. తెలంగాణ ఇస్తమని ప్రకటించింది కాంగ్రెసే. అధికారంలో ఉన్నది వాళ్లే. హామీలను అమలు చేయకపోతే వాళ్లదే తప్పయితది. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పూర్తిగా ప్రజల నమ్మకం కోల్పోతది. దీర్ఘకాలికంగా నష్టపోవలసి వస్తది. అందుకోసం వాళ్లకు ఆఖరి అవకాశం ఇస్తున్నాం. ఈ పార్లమెంటు సమావేశాల్లోపల తెలంగాణను ప్రకటిస్తే మంచిది. తరువాత నిర్ణయం తీసుకున్నా ప్రయోజనముండదు’ అని చెప్పారు. తెలంగాణ వచ్చే వరకు జేఏసీ పోరాటం ఆగదన్నారు. కాంగ్రెస్‌ను పాతరేసేందుకు మరిన్ని ప్రజా ఉద్యమాలను చేపడుతామన్నారు. ‘ఢిల్లీకి రావాలంటే అందరూ రాలేకపోవచ్చు. హైద్రాబాద్ పోంగనే చలో అసెంబ్లీ కార్యక్షికమం ఉంటది. దానికి వద్దన్నా మనోల్లు వస్తరు. ఇక్కడికే ఇంతమంది వచ్చిండ్రు. ఇగ అప్పుడు ఎంతమంది వస్తరో ఊహించుకోవచ్చు. తెలంగాణ సమాజం మొత్తం చలో అసెంబ్లీకి తరలిరావాలె. అందుకు సిద్ధంకండి’ అంటూ పిలుపునిచ్చారు. సంసద్ యాత్ర స్పూర్తిగా చలో అసెంభ్లీని విజయవంతం చేయాలని కోరారు. ‘ఇక సంసద్ యాత్ర ముగిసింది. తిరిగి మనం వచ్చిన రైలులో ‘చలో అసెంబ్లీ’ కోసం బయలుదేరుదాం’ అంటూ జేఏసీ శ్రేణులను ఉత్తేజపరిచారు.
బయ్యారం గనులు విశాఖ స్టీల్స్‌కు తరలిస్తామని నిర్ణయం తీసుకోవడాన్ని సీఎం తెలివి తక్కువతనంగా కోదండరాం అభివర్ణించారు. ప్రైవేట్ కంపెనీకి కేటాయించినప్పుడు గుర్తుకురాని జాతీయవాదం ఇప్పుడు గుర్తుకువచ్చిందా అని ప్రశ్నించారు. విశాఖ ప్లాంటుకు బయ్యారం గనులను కేటాయిస్తామని చెప్పి ఇరు ప్రాంతాల నడుమ విద్వేషాలను సీఎం రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ‘ప్రైవేట్ కంపెనీకి బయ్యారం గనులను కేటాయించింది మీ ప్రభుత్వం కాదా? అప్పుడు నువ్వు ఆ ప్రభుత్వంల భాగస్వామివి కాదా. నీ పాత్ర లేదా? నీకెంత ముట్టింది అని మీము అడిగితిమా?’ అని సీఎంపై ఆయన ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు కోసం చేసిన జరిగిన ఉద్యమంలో తాను కూడా పాల్గొన్నాని చెప్పారు. ఆంధ్ర ప్రాంతం బాగుపడితే మాకేమీ బాధలేదు. కాకపోతే తెలంగాణ ప్రాంతం బాగుపడాలన్నదే మా ఆకాంక్ష’ అని స్పష్టం చేశారు. బయ్యారం ఖనిజం తరలింపును ఎవరు ఆపుతారో చూస్తామని సీఎం చేసిన సవాల్ పై కోదండరాం స్పందిస్తూ ‘బయ్యారం ఖనిజం తరలింపు అడ్డుకునుడు ఎట్లనో మాకు తెలుసు. మాకు అది కష్టమైన పనేం కాదు. మీము మీలాగ బీరాలు పలికేటోల్లం కాదు. పని చేసి చూపిస్తం’ అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజల సమిష్టి ప్రయోజనాల కొరకే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నదని చెప్పారు. కానీ.. స్వార్థ ప్రయోజనాల కోసమే సీమాంధ్ర నేతలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రకటించాలని సంసద్ యాత్ర ద్వారా కాంగ్రెస్‌కు ఆఖరు మాట చెప్పిపోతున్నమన్నారు. యువత ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ‘ఆత్మహత్యలు వద్దు పోరాటాలే ముద్దు’ అంటూ నినాదాలతో సభను ముగించిన కోదండరాం.. సంసద్ యాత్రలో పాల్గొన్న ప్రతి సంస్థకు, నాయకులకు, సహకరించిన వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

ముట్టడికి యత్నం
కోదండరాం ప్రసంగం ముగించిన వెంటనే ర్యాలీగా బయలు దేరిన జేఏసీ కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకుపోయారు. పార్లమెంటు పోలీసు స్టేషన్ బారికేడ్లను దాటుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు ప్రశాంతంగా ముగిసింది. బారికేడ్లు దాటేక్షికమంలో పలువురు విద్యార్థి, అడ్వకేట్ నేతలకు గాయాలయ్యాయి. అడ్వకేట్ జేఏసీ నేత ఉపేంవూదకు పక్కటెములకు గాయాలయ్యాయి. ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆస్పవూతికి తరలించారు. ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. కోదండరాం, ఈటెల రాజేందర్, స్వామిగౌడ్ తదితరులు ఆస్పవూతికి వెళ్లి ఉపేంవూదను పరామర్శించారు. ధర్నా సందర్భంగా తోపులాటలో కరీంనగర్‌కు చెందిన టీఆర్‌ఎస్ మహిళా నేత తాటి ప్రభావతి మూర్చిల్లారు. ప్రాథమిక చికిత్సతో కోలుకున్నారు.

రసమయి ఆటా పాట మాట
రెండు రోజులుగా జంతర్ మంతర్ వద్ద ధూం ధాం కన్వీనర్ రసమయి బాలకిషన్ ఆట మాట పాటలతో తెలంగాణవాదులను ఉత్తేజ పరిచారు. ఢిల్లీ పోలీసులతో సహా జంతర్ మంతర్‌లో పక్కనే దీక్ష చేస్తున్న ఇతర సంఘాల నేతలు శిబిరం వద్దకు వచ్చి రసమయి ఆటపాటలను గమనించడం కనిపించింది. మంగళవారం జరిగిన ధూంధాం కార్యక్షికమంలో సాయిచంద్, స్పందన తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ కళాకారుల ఆటాపాటలు ఉద్యమకారులను ఆలోచింపచేశాయి.
cut
దీక్షలో పాల్గొన్న నేతలు
సత్యాక్షిగహ దీక్ష ముగింపు రోజు పలువురు జాతీయ నేతలు పాల్గొన్నారు. బీజేపీ సుష్మాస్వరాజ్, ఉమాభారతి, స్మృతి ఇరానీ, సీపీఐ నేతలు డీ రాజా సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్, ప్రొఫెసర్ కమల మిత్ర చినాయ్, న్యూడెమొక్షికసీ నేత అపర్ణ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

తెలంగాణపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ దానిని అమలుపరిచేందుకు సిద్ధంగా లేదని బీజేపీ నేత సుష్మాస్వరాజ్ విమర్శించారు. తెలంగాణపట్ల చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్‌ను వీడి తెలంగాణ జేఏసీలో చేరి, ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని ఆమె టీ కాంగ్రెస్ ఎంపీలకు సూచించారు. వెయ్యి మంది యువత శవాలను కండ్ల చూసిన కాంగ్రెస్ ఇంకా ఎన్ని చావులు చూడాలనుకుంటోందని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు పెడితే సమర్థిస్తామని, లేనట్లయితే రానున్న ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి రాగానే వంద రోజుల్లో తెలంగాణ ప్రకటిస్తామని పునరుద్ఘాటించారు.

బాధ సోనియాకు తెలుసా?: స్మృతి ఇరానీ
తెలంగాణ కోసం వెయ్యిమంది యువత బలిదానం చేసుకున్నా స్పందించని సోనియాగాంధీకి కన్నతల్లి కడుపుకోత తెలుసా? అని బీజేపీ నేత స్మృతి ఇరానీ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం కేంద్రంగా వచ్చిన ‘జైబోలో తెలంగాణ’ సినిమాలో ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ కార్యక్షికమంలో బోడోలాండ్ ఎంపీ బిసు ముత్యారి తదితర నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

వెల్లు సంఘీభావం
విశాలాంధ్ర ఎడిటర్ శ్రీనివాస్ రెడ్డి సత్యాక్షిగహదీక్షకు మద్దతు ప్రకటించారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే సమువూదాల వేణుగోపాలచారి, టీఆర్‌ఎస్ నేతలు బోయినపల్లి వినోద్ కుమార్, నాయిని నర్సింహాడ్డి, కేటీఆర్, ఎమ్మెల్సీ మమమూద్ అలి, జితేందర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, దాసోజు శ్రవణ్ కుమార్, ఎమ్మెల్యే భిక్షపతి, నారదాసు లక్ష్మణ్ రావు, స్వామి గౌడ్, చెరుకు సుధాకర్, మాజీ మంత్రి చంద్ర శేఖర్, బీజేపీ నేతలు దత్తావూతేయ, విద్యాసాగర్ రావు, ఎన్నం శ్రీనివాసడ్డి, నల్లు ఇంద్రసేనాడ్డి, వెదిరె శ్రీరాం, న్యూడెమొక్షికసీ నేతలు సూర్యం, గోవర్దన్, సంధ్య, జేఏసీ నేతలు విఠల్, శ్రీనివాస్ గౌడ్, అద్దంకి దయాకర్, మల్లేపల్లి లక్ష్మయ్య, రతన్, విద్యుత్ జేఏసీ నేత రఘు, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామడ్డి, వెల్‌ఫేర్ పార్టీ నేత జఫర్ ఇస్లాం ఖాన్, టీఎల్‌ఎఫ్ అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి, టీఎన్జీవో నేతలు దేవీవూపసాద్, రవీందర్ రెడ్డి, నగారా సమితి నేత నాగం జనార్దన్‌డ్డి, తెలంగాణ ప్రోగ్రెసివ్ ఫోరం నేత రౌతు కనకయ్య, టీడీఎఫ్ నేత డీపీ రెడ్డి, గ్రేటర్ హైద్రాబాద్ జేఏసీ నేత కృష్ణ యాదవ్, విద్యార్ధి జేఏసీ నేతలు గాదరి కిశోర్, పున్నా కైలాష్, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నేత సత్యం, టీఆస్వీ నేత బాల్క సుమన్, తెలంగాణ జర్నలిస్టు పోరం నేతలు ఏ రాజేశ్, రమేశ్ హజారి, అవ్వారు భాస్కర్, అస్కాన్ మారుతి సాగర్, ట్రైబల్ జేఏసీ నేత సీతారామ్ నాయక్, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేతలు మామిడి నారాయణ, పవన్, తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్ నేత పల్లె వినయ్ కుమార్, మట్టి మనుషులు నేత వేనేపల్లి పాండురంగారావు, మాజీ టీఆస్ నేత ఉమాదేవి, దశరధ, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం నేతలు శ్యాం ప్రసాద్ రెడ్డి, విద్యార్ది నేత యాకూబ్ రెడ్డి, సీనియర్ తెలంగాణవాది కెప్టెన్ పాండురంగాడ్డి తదితరులు రెండోరోజు సత్యాక్షిగహదీక్షలో పాల్గొన్నవారిలో ఉన్నారు. వీరితోపాటు తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు రాజేందర్ రెడ్డి, ప్రహ్లాద్ టీఎన్జీవో నేతలు రామినేని శ్రీనివాస్, నర్సింగరావు, టీఎన్జీవో నగర శాఖ అధ్యక్షుడు కస్తూరి వెంక కార్యదర్శి హరిబాబు, నేతలు లక్ష్మినారాయణ, నజీర్, తాండూర్ నియోజక వర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బైండ్ల విజయ్ కుమార్, రంగారావు, సోమశేఖర్, కృష్టారావు, గోపాల్, బీఎస్‌ఎన్‌ఎల్ జేఏసీ నేత జగన్‌మోహన్‌డ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నేత శేఖర్ గౌడ్, తెలంగాణ నెటిజెన్స్ ఫోరం, మెడికల్ జేఏసీ, మహబూబ్‌నగర్ తెలంగాణ విద్యావంతుల వేదిక, పేదల సంక్షేమ సంఘం, తెలంగాణ వికలాంగుల జేఏసీ, కుల సంఘాల జేఏసీ తదితర సంస్థల నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు సద్బుద్ధి ప్రసాదించు: స్వామి అగ్నివేశ్
తెలంగాణ ప్రజల బలిదానాలను అపహాస్యం చేస్తూ, ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్‌కు సద్బుద్ధిని ప్రసాదించాలని ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ ప్రార్థించారు. రెండోరోజు దీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రకటించి కాంగ్రెస్ కనీసం తెలంగాణలోనైనా బతకాలని సూచించారు. లేదంటే సీమాంవూధలో, తెలంగాణలో నామరూపాలు లేకుండా పోతుందని హెచ్చరించారు.

This entry was posted in NATIONAL NEWS, TELANGANA NEWS, Top Stories.

Comments are closed.