రద్దు చేయను ఏం చేసుకుంటవో చేసుకుకో :సీఎం

హైదరాబాద్ : ‘బయ్యారం గనులను విశాఖకు కెటాయించానని రద్దు చేసేది లేదని ఏం.. చేసుకుంటవో చేసుకో’ అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ని ఉద్దేశించి అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో అమ్మహస్తం ప్రారంభించిన సభలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. లక్ష హెక్టార్ల బయ్యారం గనులను వ్యక్తికి కేటాయించినప్పుడు కేసీఆర్ బెల్లం కొట్టిన రాయిలా పడి ఉన్నాడని సీఎం విమర్శించారు. తను జాతి కోసం బయ్యారం గనులను విశాఖకు కెటాయిస్తే కేసీఆర్ భూకంపం సృస్టిస్తానంటున్నాడని, కేసీఆర్ బెదిరింపులకు ఆదిరేది లేదని సీఎం కిరణ్ రెట్టించిన స్వరంతో అన్నారు. తెలంగాణ ఉద్యమం వల్ల విద్యార్థుల జీవితం నష్టపోయిందన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.