రణభేరీ మోగించిన సకలజనులు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సకల జనభేరి సభకు తెలంగాణలోని తొమ్మిది జిల్లాల నుంచి పోరుబిడ్డలు భారీగా తరలివచ్చారు.

జేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక సంఘాలు, టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమోక్షికసీ పార్టీల శ్రేణులు లక్షలాదిగా బస్సులు, జీపుల్లో భారీ కాన్వాయ్‌గా బయలుదేరి సభకు హాజరయ్యారు. సమీప జిల్లాల్లోని విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీలతో నిజాం కాలేజీ మైదానానికి చేరుకున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి తెలంగాణవాదులు ఉదయానికే నగరానికి చేరుకుని పలు ప్రాంతాల నుంచి ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
కదిలిన తెలంగాణ
నల్లగొండ నుంచి ప్రైవేట్ బస్సుల్లో జేఏసీ ఆధ్వర్యంలో 50 వాహనాల్లో తెలంగాణవాదులు, విద్యార్థులు, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మరో 25 ప్రైవేట్ బస్సుల్లో తరలి నల్లగొండ నియోజకవర్గం నుంచి 10 వేల మందికిపైగా వెళ్లినట్లు సమాచారం. వైద్య ఉద్యోగులు డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి వెళ్లగా, రెవెన్యూ, తెలంగాణ జాగృతి, పంచాయతీరాజ్ సర్వాస్ అసోసియేషన్ నుంచి ఉద్యోగులు తరలి జిల్లా నుంచి 60 వేల మందికిపైగా వెళ్లినట్లు జేఏసీ నాయకులు పేర్కొంటున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండ అదాలత్ సెంటర్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు జెండా ఊపి హైదరాబాద్‌కు వెళ్లే ర్యాలీని ప్రారంభించారు. ఉద్యోగులు, టీఆర్‌ఎస్ శ్రేణులు 20 వేల మందికిపైగా తరలి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో 200 వాహనాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు సభకు తరలి మంథనిలో టీఆర్‌ఎస్ నాయకుడు చందుపట్ల సునీల్‌డ్డి, హుజురాబాద్‌లో ఈటెల అనుచరులు, రామగుండం నుంచి టీఆర్‌ఎస్ నాయకులు, సిరిసిల్ల నుంచి కేటీఆర్ అనుచరులు తెలంగాణవాదులతో కలిసి తరిలారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలు గడ్డం అరవిందడ్డి, కావేటి సమ్మయ్య, నల్లాల ఓదెలు, వేణుగోపాలచారి, జోగు రామన్న, టీఆర్‌ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్, పశ్చిమ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు ఆధ్వర్యంలో, బాసర నుంచి 500 మంది తరలి టీబీజీకేఎస్, సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు వెళ్లారు. ఖమ్మం జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో 75 బస్సులు, పది తవేరాలతోపాటు వందలాదిమంది కార్లలో, వేలాదిమంది రైళ్లలో రాజధానికి వెళ్లారు. మెదక్ జిల్లా నుంచి 50 వేల మంది వరకు తరలి టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు, గాయకుడు దేశపతి శ్రీనివాస్, గాలి అనిల్‌కుమార్ నేతృత్వంలో భారీ బైక్‌ర్యాలీగా వెళ్లారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్‌తో, జిల్లా నుంచి తెలంగాణవాదులు పెద్ద ఎత్తున తరలి నిజామాబాద్ జిల్లా నుంచి 50 వేల మందికి పైగా సకల జనభేరిలో పాల్గొన్నారు. రంగాడ్డి జిల్లా నుంచి సకల జనభేరీకి వేలాదిగా జిల్లా నుంచి సబ్బండ వర్ణాలు తరలాయి. అంతకు ముందు జిల్లాలో ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణపై విషం కక్కుతున్న సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిగి ఎమ్మెల్యే హరీశ్వడ్డితోపాటు టీచర్లు, ఉద్యోగ సంఘాల నాయకులు ర్యాలీలుగా వేదిక వద్దకు మధ్యాహ్నంలోపే చేరుకున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.