తనను సస్పెన్షన్ చేయడంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావులపై ఆరోపణలు చేసిన రఘునందన్‌పై తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జిల్లాలో పలుచోట్ల రఘునందన్ వ్యాఖ్యలపై నిరసనలు కొనసాగాయి. రఘునందన్‌రావును పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. సంవత్సరాలుగా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన రఘునందన్‌రావు వెంట ఎవరూ కలసిరాకపోవడం గమనార్హం. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే కారణంతో పార్టీ అధినేత కేసీఆర్ రఘునందన్‌రావును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పారిక్షిశామికవేత్తలనుంచి పలు ఫిర్యాదులు అందడం, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేత సుజనాచౌదరిలను పలుమార్లు రఘునందన్ కలిసినట్లు టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటున్నారు. ఇదిలా ఉండగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై రఘునందన్‌రావు తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ అధినేతతో పాటు నాయకులపై పలు ఆరోపణలు చేశారు.
అయితే రఘునందన్ సస్పెన్షన్‌పై జిల్లాలో పెద్దగా స్పందన కనిపించలేదు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన చాలా రోజులు పనిచేసినప్పటికీ రఘునందన్ సస్పెన్షన్‌ను పార్టీ శ్రేణులు ఎవరూ పట్టించుకోలేదు. ప్రెస్‌మీట్ నిర్వహించిన రఘునందన్ వెంట కనీసం ఒకరిద్దరు నాయకులు కూడా లేకపోవడం ఆయన పనితనానికి నిదర్శనం పడుతుందని టీఆర్ఎస్ నాయకులు కొందరు చెప్పుకొచ్చారు. 2007 నుంచి 2012 డిసెంబర్ వరకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా రఘునందన్ పనిచేశారు. అయితే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా జిల్లాలో ఆ పార్టీకి చెందిన మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకుపూవరూ స్పందించకపోవడం గమనార్హం. రఘునందన్‌ను టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని తెలియగానే జిల్లాలో ఎక్కడి నుంచి వ్యతిరేకత ఎదురుకాలేదు. అయితే రఘునందన్‌రావు మీడియా పులిలా వ్యవహరించారు తప్ప పార్టీకి ఆయన చేసిందేమీలేదని విమర్శించారు.
టీఆర్ఎస్లో ఉంటూనే పార్టీకి ద్రోహం తలపెట్టడం వల్లే అధినేత సస్పెండ్ చేశారని టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి రాజయ్యయాదవ్ పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా పార్టీలో వివిధ పదవులు పొందిన ఆయన అధినేతపైనే ఆరోపణలు చేయడాన్ని తెలంగాణ వాదుపూవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయినా రఘునందన్ వ్యాఖ్యలను, ఆరోపణలను ఎవరూ పట్టించుకోవడం లేదని కొట్టిపారేశారు. ఇదిలా ఉండగా రఘునందన్ సస్పెన్షన్‌పై పటాన్చెరు ప్రాంతంలోని టీఆర్ఎస్ నాయకుల్లో ఒక్కింత హర్షం వ్యక్తమైంది. సిద్దిపేటలో కూడా టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ, రఘునందన్ పార్టీ కోసం చేసిందేమీలేదని, ఆయనను సస్పెన్షన్ చేసి మంచి పనిచేశారని పలువురు నాయకులు పేర్కొన్నారు. రఘునందన్ పార్టీలో ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే, ఆ విషయం గుర్తించడం వల్లే అధినేత వేటు వేశారని చెప్పుకొచ్చారు. ఏదేమైనా రఘునందన్‌రావు సస్పెన్షన్‌పై రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరిగింది.
ఇదిలా ఉండగా రఘునందన్‌రావు వ్యాఖ్యలపై హరీశ్‌రావుతో పాటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ముఖ్యనాయకుపూవరూ పెద్దగా స్పందించలేదు. హరీశ్‌రావు మాట్లాడుతూ ఆయనేదో తప్పుడు ఆరోపణలు చేసినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ శ్రేణులు రఘునందన్ సస్పెన్షన్‌పై హర్షం వ్యక్తం చేయడంతోనే ఆయన ఎలాంటి వారో అర్థమైపోతుందని పేర్కొన్నారు. మరో నాయకుడు మాట్లాడుతూ రఘునందన్ పార్టీకి చాలా కాలంనుంచే దూరమయ్యారని, ఆయన గురించి ఇప్పుడు మాట్లాడడం అవసరం లేదన్నారు. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి నుంచి బీజేపీ సీనియర్ నాయకులు కూడా రఘునందన్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలో చేరాలనే సందిగ్ధంలో ఉన్నట్టు తెలిసింది.