రగులుతున్న కాలమా!

-సెప్టెంబ మొదటివారంలో ‘చలో హైదరాబాద్’
-టీ జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపు
-7న సమైక్యాంధ్ర సభకు సిద్ధమవుతున్న ఏపీఎన్జీవోలు
-అదే రోజు మరో మిలియన్ మార్చ్ తప్పదన్న ఓయూ, టీఎస్ జేఏసీ
-సమైక్యాంధ్ర సభను అడ్డుకుని తీరుతామని స్పష్టీకరణ
తెలంగాణ సమాజం రగులుతోంది. హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ నెలలో భారీ ఉద్యమాలకు సన్నద్ధమవుతోంది.
kodandaతెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ నగరంలో ఏపీఎన్జీవోలు సమైక్యాంధ్ర సభను నిర్వహించేందుకు సన్నద్ధమవుతుండగా.. ఏపీఎన్జీవోల కుట్రలను తిప్పికొ తెలంగాణ ఉద్యమకారులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ మొదటివారంలో ‘చలో హైదరాబాద్’ నిర్వహించనున్నట్టు తెలంగాణ జేఏసీ ప్రకటించింది. తెలంగాణ అమరులకు నివాళులర్పిస్తూ నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహిస్తామని, ఇందుకు తెలంగాణ ప్రజలందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7న ఏపీఎన్జీవోలు తలపెట్టిన సమైక్యాంధ్ర సభను అడ్డుకొని తీరుతామని తేల్చిచెప్పింది.

మరోవైపు తెలంగాణ విద్యార్థి, ఉద్యోగ సంఘాలు కూడా ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన సమైక్యాంధ్ర సభపై భగ్గుమన్నాయి. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఏపీఎన్జీవోలు తలపెట్టిన సమైక్యాంధ్ర సభను అడ్డుకొని తీరుతామని, దీనికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 7న మరో మిలియన్ మార్చ్ (శాంతి ర్యాలీ) నిర్వహిస్తామని ఓయూ జేఏసీ ప్రకటించింది. నిజాం కళాశాల నుంచి ర్యాలీని ప్రారంభించి.. ఎల్బీ స్టేడియం మీదుగా గన్‌పార్క్ వరకు చేపడతామని ఓయూ జేఏసీ నేతలు తెలిపారు.

ఇందుకోసం ఓయూ జేఏసీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ తదితరులు గురువారం సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌డ్డిని కలిసి అనుమతి కోరారు. ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సమైక్య సభను అడ్డుకొని తీరుతామని టీఎస్ జేఏసీ అధ్యక్షుడు పిడమర్తి రవి స్పష్టం చేశారు. అదే రోజున ఎల్బీస్టేడియం వద్ద వేలాదిమంది విద్యార్థులతో ‘మిలియన్ మార్చ్-2’ చేపడతామని ఆయన ప్రకటించారు. గురువారం ఇందిరాపార్కు వద్ద జరిగిన ‘శాంతి దీక్ష’లో ప్రసంగించిన వక్తలు కూడా సెప్టెంబర్ నెలలో సమరమేనని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత కూడా హైదరాబాద్‌లో ‘సమైక్యాంధ్ర’ పేరుతో సభలు నిర్వహిస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఆ తరువాత జరిగే పరిణామాలకు సీమాంధ్ర సర్కారే సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీక్షలో కోదండరాం మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటి వారంలో ‘చలో హైదరాబాద్’ పేరుతో నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.

ఏపీ ఎన్జీవోలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు దేవీవూపసాద్, శ్రీనివాస్‌గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణవాదులను రెచ్చగొ మాట్లాడుతూ సమైక్యాంధ్ర పేరుతో ఏపీ ఎన్జీవోలు సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు. వారు హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఆ తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తెలంగాణ ప్రజలు ప్రతిఘటన మొదలుపెడితే పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఊహించుకోవడం కష్టమని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 7న ఏపీఎన్జీవోలు సమైక్యాంధ్ర సభను తలపెట్టడంతో నగరంలో క్రమంగా పరిస్థితి వేడెక్కుతోంది. ఈ సభను ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకుని తీరుతామని తెలంగాణవాదులు తేల్చిచెబుతుండటంతో.. సెప్టెంబర్ 7న ఏం జరుగుతుందోనన్న గుబులు పోలీసు వర్గాల్లో నెలకొంది.

మరో మిలియన్ మార్చ్
తెలంగాణ వాదులపై సీమాంవూధులు చేస్తున్న దాడులను నిరసిస్తూ వచ్చేనెల ఏడవ తేదీన నిర్వహించ తలపెట్టిన శాంతిర్యాలీ(మిలియన్ మార్చ్-2)కి అనుమతించాలని కోరుతూ ఓయూ జేఏసీ నాయకులు గురువారం సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌డ్డిని కలిశారు.

ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. శాంతిభవూదతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా శాంతి ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిజాం కళాశాల మైదానం నుంచి ర్యాలీని ప్రారంభించి, ఎల్‌బీ స్టేడియం మీదుగా గన్‌పార్క్ వరకు సాగుతుందని వివరించారు. డీసీపీని కలిసిన వారిలో తెలంగాణ విద్యార్థి జేఏసీ అధికారి ప్రతినిధి క్రిశాంక్, తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జోవోలు తలపెట్టిన సమైక్యాంధ్ర సభను అడ్డుకొని తీరుతామని టీఎస్ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి స్పష్టం చేశారు. అదే రోజు ఎల్‌బీస్టేడియం వద్ద మిలియన్ మార్చ్ -2 చేపడుతామని తెలిపారు. వచ్చే నెల 7న నగరంలో సమైక్యాంధ్ర సభను జరగనివ్వమని టీఎస్ జాక్, ఓయూ జాక్ నాయకులు పేర్కొన్నారు. ఓయూలో గురువారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 7న సభ నిర్వహించాలని చూస్తే తెలంగాణ విద్యార్థి, ప్రజాయుద్ధభేరి పేరుతో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.