రగిలిన స్ఫూర్తి

KCR-నేతల అరెస్టుపై తెలంగాణవాదుల నిరసన
-కిక్కిరిసిపోయిన జిల్లా జైలు ప్రాంగణం
-రాస్తారోకో, ధర్నాతో స్తంభించిన రహదారి
-పోలీసులతో వాగ్వాదం, తోపులాట
-టీ కాంగ్రెస్ నేతల రాకతో జనం ఆగ్రహం
-ద్రోహుల్లారా గోబ్యాక్ అంటూ నినాదాలు
-ఉద్యమకారులను శాంతపరిచిన హరీష్‌రావు
ఉద్యమ నాయకుల అక్రమ అరెస్టులకు నిరసనగా తెలంగాణవాదులు శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జైలు ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్షికమాలకు దిగారు. జైలులో ఉన్న వారిని పరామర్శించేందుకు టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్యే హరీశ్‌రావు, సీనియర్ నాయకులు నాయిని నర్సింహాడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలియడంతో జైలు ప్రాంగణమంతా తెలంగాణవాదులతో కిక్కిరిసిపోయింది. ఉద యం నుంచే జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి టీఆర్‌ఎస్, బీజేపీ, జేఏసీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్య లో జైలు వద్దకు చేరుకున్నారు. జైలులో ఉన్న తమ అభిమాన నేతలకు మద్దతు గా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

jupalliమహబూబ్‌నగర్- భూత్పూర్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ముందస్తుగా భారీగా మోహరించిన పోలీసు లు తెలంగాణవాదులను అడ్డుకునే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. రహదారిపైనున్న తెలంగాణవాదులంతా ఒక్కసారిగా వచ్చి జైలు గేటును తోసి లోపలికి చొచ్చుకొనిపోయే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తెలంగాణవాదులను బయటకు నెట్టివేసే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు, తెలంగాణవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్వల్పంగా లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మళ్లీ రోడ్డుపై బైఠాయించిన ఉద్యమకారులు ముఖ్యమంవూతికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ సమయంలో సహనం నశించి, వాహనాలపై దాడి చేసేందుకు సిద్ధపడ్డారు. కొంతమంది నేతలు నచ్చజెప్పడంతో విరమించుకున్నారు.

క్షణక్షణం ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు తెలంగాణవాదులను ఉత్సాహపరిచేందుకు కళాకారుడు సాయిచంద్ బృందం తెలంగాణ ఉద్యమ పాటలు పాడుతూ ఉర్రూతలూగించింది. జైలులో ఉన్న నేతలను మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య, సీనియర్ సంపాదకుడు పొత్తూరి వెంక మాజీ మంత్రి చంద్రశేఖర్, తెలంగాణ ప్రజావూఫంట్ రాష్ట్ర నాయకులు వేదకుమార్ ఉదయం పరామర్శించారు.

కాంగ్రెస్ ద్రోహులారా ఖబడ్దార్
జైలు ఎదుట ఉద్రిక్త పరిస్థితులు తగ్గుతున్న సమయంలో సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కాంగ్రెస్ ఎంపీలు మందా జగన్నాథం, రాజయ్య, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కేశవరావు నేతలను పరామర్శించేందుకు జైలుకు వచ్చారు. కాంగ్రెస్ నేతలు పరామర్శకు రావడాన్ని జీర్ణించుకోలేక పోయిన తెలంగాణ ఉద్యమకారులు ‘తెలంగాణ ద్రోహుల్లారా ఖబడ్దార్’ అంటూ నినాదాలు చేశారు. ఓ వైపు కొందరు సొడాబుడ్లు, రాళ్లు, కర్రలు పట్టుకొని కాంగ్రెస్ నేతలపై దాడికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హరీశ్‌రావు జైలు గేటు బయట ఉన్న తెలంగాణవాదులను శాంతపర్చేందుకు ప్రయత్నించారు. అయినా వారు కాంగ్రెస్ నేతలు ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. తెలంగాణకోసం ఉద్యమిస్తున్న నేతలను అరెస్టు చేయించిన అధికార పార్టీ నేతలకు తెలంగాణ ఉద్యమకారులను పరామర్శించే అర్హతలేదని మండిప

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.