రగిలిన తెలంగాణ

అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు విరుద్ధంగా రాయల తెలంగా ణ ఏర్పాటు చేస్తామంటూ కేంద్రం నుంచి వస్తున్న ప్రకటనలు రావణ కాష్టాన్ని రగిలించాయి. సీమాంధ్ర పాలకుల వివక్ష నుంచి విముక్తి కోరుకుంటున్న ప్రజలను మళ్లీ, అదే ఊబిలోకి నెట్టే ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు. రాయల టీపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ జిల్లాల్లో నిరసనలు ఊపందుకున్నాయి. మంగళవారం ర్యాలీలు, రాస్తారోకో, దిష్టిబొమ్మల దహనా లు, దీక్షలు కొనసాగాయి. హైదరాబాద్ రాజధానితో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప రాయలకు అంగీకరించేదిలేద ని తేల్చిచెబుతున్నారు. యూపీఏ తీర్మానం, సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారమే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని లేకుంటే రణం తప్పదని హెచ్చరిస్తున్నారు.

నోటికి నల్లవస్త్రాలతో మౌనదీక్ష
వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. న్యాయవాదులు, వైద్యులు, విద్యార్థులు, వివిధ జేఏసీలు నిరసన దీక్ష చేపట్టాయి. వరంగల్‌లో కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి దీక్షలో కూర్చున్నారు. మహబూబాబాద్, తొర్రూరులో కోర్టు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. మరిపెడలో తెలంగాణవాదులు సీఎం కిరణ్ దిష్టిబొమ్మను, కేయూలో ఏబీవీపీ ఆధ్వర్యంలో కేం ద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్‌ఎస్వీ యూత్ విభాగం ఆధ్వర్యంలో నక్కలగుట్టలోని కాళోజీ సెంటర్‌లో నిరసన దీక్ష చేపట్టారు. అమరవీరుల స్తూపం వద్ద బీసీ జేఏ సీ నిరసన తెలిపింది. టీ జేఏసీ ఆధ్వర్యంలో వైద్యులు ధర్నా చేశారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా న్యూడెమోక్షికసీ ఆధ్వర్యం లో ఆందోళనలు నిర్వహించారు. జిల్లా కేంద్రలో భారీ ర్యాలీ నిర్వహించి కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో లాయర్లు నిరసనలు చేపట్టారు. విధు ల బహిష్కరణతో పాటు కేంద్రం దిష్టిబొమ్మలను దహనం చేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌లో బార్‌అసోసియేషన్ ఆధ్వర్యం లో లాయర్లు విధులు బహిష్కరించారు. జేఏసీ దీక్ష శిబిరం లో నోటికి నల్లగుడ్డలు కట్టుకొని మౌనదీక్ష చేపట్టారు.

న్యాయవాదుల బైక్‌ర్యాలీ
నల్లగొండ, నకిరేకల్, దేవరకొండలో న్యాయవాదులు విధు లు బహిష్కరించి బైక్ ర్యాలీ చేపట్టారు. మునుగోడులో జేఏ సీ ర్యాలీ, సూర్యాపేటలో న్యూడెమోక్షికసీ ఆధ్వర్యంలో కేం ద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. మిర్యాలగూడలో బీసీ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. కోదాడలో తెలంగాణ సాధన సమితి, విశ్వవూబాహ్మణ, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. భువనగిరి, ఆలేరులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మహబూబ్‌నగర్, జిల్లా వ్యాప్తంగా న్యూడెమోక్షికసీ, పీడీఎస్‌యూ, ఏబీవీపీ, టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏబీవీపీ నాగరాజు ఆధ్వర్యంలో, పాలమూరు వర్సిటీ విద్యార్థులు, గద్వాలలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. నారాయణపేటలో ఏబీవీపీ, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ తీసి కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేశారు. వనపర్తి, దామరగిద్ద, దేవరకద్ర, నాగర్‌కర్నూల్, అచ్చంపేటలలోనూ నిరసనలు కొనసాగాయి. రంగాడ్డి జిల్లా తుక్కుగూడలో శ్రీశైలం రహదారిపై టీజేఎఫ్ ఆద్వర్యంలో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. మేడ్చల్‌లో జేఏసీ నాయకులు మౌనదీక్ష చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో, జగిత్యాలలో కాంగ్రెస్, కేంద్రం దిష్టిబొమ్మలను దహనం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.