యూపీఏ అజెండాలో భాగం కాదు

– తెలంగాణపై నాలుగు నెలల్లో మాట మార్చిన చాకో
తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం కొత్త పల్లవి అందుకుంది. ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెబుతూ వస్తున్న ఆ పార్టీ జాతీయ నాయకులు.. ఇప్పుడు ఉన్నపళంగా మాట మార్చేశారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యూపీఏ జాతీయ అజెండాలో భాగం కాదని తేల్చేశారు. ఇది కేవలం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదని తీర్మానించారు.‘ఈ అంశం (తెలంగాణ ఏర్పాటు) యూపీఏ జాతీయ అజెండాలో లేదు. కచ్చితంగా లేదు. ఇది సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అంశం’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో శనివారం ఏఐసీసీ కార్యాలయం వద్ద

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.