యూపీఏకు పడిపోతున్న ప్రజాదరణ

rahul2014 ఎన్నికల్లో గెలుపు కష్టమే
ప్రధానిగా మోడీకే జనం మద్దతు
ఏపీలోనూ కాంగ్రెస్ గల్లంతే
సీమాంధ్రలో జగన్ పార్టీదే గెలుపు
తెలంగాణలో టీఆర్‌ఎస్ హవా
– దిగజారుతున్న ప్రజాదరణ
-2014 ఎన్నికల్లో గెలుపు కష్టమే
– ప్రధానిగా మోడీకే జనం మద్దతు
– ఏపీలోనూ కాంగ్రెస్ గల్లంతే
– సీమాంవూధలో జగన్ పార్టీదే గెలుపు
-తెలంగాణలో టీఆర్‌ఎస్ హవా
– ఇండియా టుడే, నీల్సన్ సర్వేలో వెల్లడి
ఇండియా టుడే, నీల్సన్ సర్వేలో వెల్లడి

దేశంలో యూపీఏకు ప్రజాదరణ నానాటికీ తగ్గిపోతున్నదా? వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ చాన్స్ మిస్సవనుందా? అట్టహాసంగా కాంగ్రెస్ తెరపైకి తెచ్చిన రాహుల్‌గాంధీ కంటే ప్రధాని అభ్యర్థి రేసులో జనామోదం బీజేపీ నేత, గుజరాత్ సీఎం నరేంవూదమోడీకే అధికంగా ఉందా? రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి హుళక్కేనా? ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం ఇస్తున్నది ఇండియాటుడే-నీల్సన్ నిర్వహించిన సర్వే! దేశంలో పెచ్చరిల్లిపోతున్న అవినీతి, గణనీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. అది చూపిస్తున్న ధరల ప్రతాపం.. అనేకానేక సామాజిక ఆర్థిక సమస్యలు.. ప్రత్యేకించి మహిళల భద్రత తదితరాలు యూపీఏ ప్రజాదరణను నానాటికీ దిగజారుస్తున్నాయని ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో నిర్వహించిన ఇండియాటుడే-నీల్సన్ ద్వైవార్షిక సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఎన్డీయేకు 159 స్థానాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆ కూటమికి 198 నుంచి 208 మధ్య సీట్లు లభించే అవకాశం ఉందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. యూపీఏకు ప్రస్తుతం 259 స్థానాలు ఉండగా అవి 152-167కు పరిమితమవుతాయని తెలిపింది. యూపీఏ వైఫల్యాలు ఇతర పార్టీలకూ లబ్ధిచేకూర్చి.. ప్రస్తుతం ఉన్న 125 స్థానాల నుంచి 178-188కి పెంచుతాయని అంచనా వేసింది. ఇక ప్రధానిగా రాహుల్‌కంటే మోడీకే అధిక అవకాశాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. రాహుల్‌ను ప్రధానిగా చూడాలనుకునేవారు 41శాతం ఉంటే..

మోడీ ప్రధాని కావాలనుకునేవారు 57శాతానికిపైగానే ఉన్నారని తెలిపింది. గడిచిన ఆరు నెలల్లో చర్చకు వచ్చిన అన్ని ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైందని సర్వే తేల్చింది. ఇక ఆంధ్రవూపదేశ్‌లో రానున్న ఎన్నికలు కాంగ్రెస్‌కు గడ్డుకాలమేనని సర్వేతేల్చింది. ప్రస్తుతం 33 స్థానాలు ఉన్న కాంగ్రెస్‌కు 3-8 స్థానాలు మాత్రమే దక్కుతాయని, జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను గెల్చుకుంటుందని వెల్లడించింది. రాష్ట్రంలోని మొత్తం ఓటింగ్‌లో సగానికిపైగా ఓట్లు వైఎస్సార్సీపీ, టీఆర్‌ఎస్ ఖాతాలో చేరుతాయని సర్వే అంచనా వేసింది. యూపీఏ సర్కారు ప్రజాదరణ నానాటికీ తగ్గిపోతోంది. మరోసారి అధికారంలోకి రావాలన్న ఆ కూటమి ఆకాంక్ష నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. 2014 లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉందనగా ఇండియా టుడే-నీల్సన్ సంస్థ నిర్వహించిన తాజా దైవార్షిక సర్వేలో యూపీఏకు పతికూల ఫలితాలు వెలువడ్డాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ కూటమికి కన్నా ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి అత్యధిక సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. ఎన్డీయే కూటమి 198-208 మధ్య సీట్లు గెలిచే అవకాశముందని అంచనా వేసింది. 2009 ఎన్నికల్లో 159 సీట్లు గెలుచుకున్న ఎన్డీయేకు ఇది గణనీయమైన పురోగతియే. అదే సమయంలో యూపీఏ కూటమి ప్రస్తుతమున్న 259 సీట్ల నుంచి 157 సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది.

ఇతర పార్టీల సీట్లు ప్రస్తుతమున్న 125 నుంచి 183కు పెరుగుతాయని తెలిపింది. అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ, ఎన్డీయే కూటమి సతమతమవుతున్నప్పటికీ యూపీఏ వైఫల్యం వల్ల ప్రతిపక్ష కూటమి 2014 ఎన్నికల్లో గణనీయమై లబ్ధి పొందుతుందని సర్వే అభివూపాయపడింది. యూపీఏ మిత్రపక్షాలైన ఎస్పీ అధినేత ములాయంసింగ్ ఉత్తరవూపదేశ్‌లో, డీఎంకే అధినేత కరుణానిధి తమిళనాడులో రానున్న ఎన్నికల్లో దెబ్బతినే అవకాశముందని పేర్కొంది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ తన సీట్లను నిలబెట్టుకోవచ్చునని అంచనా వేసింది. రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలతో సంచనలం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ రానున్న ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపబోరని సర్వేలో తేలింది.

మోడీ హవా!
అదే సమయంలో బీజేపీ బలమైన నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంవూదమోడీ ప్రజాభిమానం గణనీయంగా పెరిగింది. దేశ ప్రధానిగా మోడీని అత్యధిక మంది కోరుకుంటున్నారు. గత ఆరు నెలల కాలంలో నరేంవూదమోడీ అత్యధిక జనాభిమానం కలిగిన నేతగా మోడీ ఆవిర్భవించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా యువనేత రాహుల్‌గాంధీకి మెజార్టీ ప్రజల మద్దతు లభించింది. వాస్తవానికి ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ మోడీ-రాహుల్ ముఖాముఖి పోటీకి ఇష్టపడకపోయినా, ఇద్దరిలో ఎవరు ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ఇండియా టూడే ప్రజలను ప్రశ్నించగా, 57శాతం మంది మోడీకి సై అన్నారు. ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమితుడైన రాహుల్‌గాంధీకి 41శాతం మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌కు 52 శాతం ‘అవును’ చెప్పగా, 36 శాతం మంది వ్యతిరేకత తెలిపారు. మోడీ విషయానికొస్తే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఆయనకు 54 శాతం మంది ఓటేశారు. అదే సమయంలో 26% మంది వ్యతిరేకత తెలిపారు.

‘మన్’పంసదు కాదు!
ప్రజల ఆకాంక్షలను అందుకోవడంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ దారుణంగా విఫలమయ్యారని ఇండియా టుడే-నీల్సన్ సర్వే స్పష్టంచేసింది. గత ఆరు నెలల కాలంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అన్ని రంగాల్లోనూ ఆయన ప్రజలను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారని తేల్చిచెప్పింది. గత మూడేళ్లలో ప్రధాని పనితీరుపై 26 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తంచేశారు. 39 శాతం మంది ఓ మోస్తరుగా ఉందని పేర్కొనగా, 27 శాతం మంది చెత్తగా ఉందని సర్వేలో పేర్కొన్నారు. అదే సమయంలో ప్రభుత్వ పనితీరు ఓ మోస్తరుగా ఉందని 42 శాతం మంది అభివూపాయపడగా, చెత్తగా ఉందని 27శాతం మంది, బాగుందని 23 శాతం మంది తమ అభివూపాయాన్ని తెలిపారు. యూపీఏ-2 హయాంలో అవినీతిపరుల్లో పోలీసుల (24%) కన్నా రాజకీయ నాయకులే (58%) అత్యధికంగా ఉండటం గమనార్హం.

సంస్కరణలపై తీవ్ర అసంతృప్తి!
యూపీఏ సర్కారు భారీస్థాయిలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలను ప్రజలు నిర్దంద్వంగా తిరస్కరించారు. ప్రభుత్వ సంస్కరణల పట్ల ‘అసంతృప్తి’గా ఉన్నామని ఏకంగా 49 శాతం మంది సర్వేలో తేల్చిచెప్పారు. సంస్కరణలపై సంతృప్తి వ్యక్తంచేసిన వారు 37శాతం మంది మాత్రమే. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐల అనుమతి నిర్ణయాన్ని 40 శాతం మంది వ్యతిరేకించారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే!
ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ప్రజాక్షిగహం వ్యక్తమైన ప్రస్తుత తరుణంలో వెంటనే ఎన్నికలు వస్తే యూపీఏ కూటమి కష్టకాలమేనని సర్వే పేర్కొంది. ప్రస్తుతం ఒక్కసారిగా తలెత్తిన ప్రజాందోళనల ప్రతికూల ప్రభావం ఆ కూటమిపై పడుతుందని పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే యూపీఏకు 171-181 మధ్య సీట్లు వచ్చే అవకాశముందని అంచనా వేసింది. కాగా, 195 నుంచి 205 సీట్లు గెలుపొంది ఎన్డీయే ముందంజలో ఉంటుందని తెలిపింది.
రాష్ట్రాలకు సంబంధించి ఉత్తమ ముఖ్యమంవూతిగా మరోసారి నరేంవూదమోడీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానంలో బీహార్ సీఎం నితీశ్‌కుమార్ ఉన్నారు. 18 రాష్ట్రాల ఈ జాబితాలో ఆంధ్రవూపదేశ్ సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ఎనిమిదో స్థానంలో నిలువగా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అట్టడుగున నిలిచారు

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.