యూటీ ఆర్టీ జాన్తా నై.. తెలంగాణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ప్రధాన అంకం ముగిసింది. టీ బిల్లును కేంద్ర కేబినెట్ అమోదించింది. దీంతో రాష్ట్ర విభజన ప్రహసనంలో కీలక అడుగు పడింది. విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇక మిగిలింది. పార్లమెంటు ఆమోదించడమే. ప్రధాని నివాసంలో దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం కేబినెట్ బిల్లుకు పచ్చ జెండా ఊపింది.

సీమాంధ్ర నేతలు పెట్టిన 10 డిమాండ్లలో ఒకటి రెండు సవరణలు తప్ప మిగతా బిల్లును యథాతథంగా ఆమోదించినట్లు సమాచారం. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం, రాయల సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం మినహా ఇతర ఏడిమాండ్లకు కేబినెట్ అంగీకరించలేదని తెలుస్తోంది. యూటీపై కేబినెట్‌లో వాడివేడిగా వాదనలు జరిగినట్లు తెలుస్తోంది. సీమాంద్రకు చెందిన కావూరి, పళ్లం రాజు హైదరాబాద్‌ను యూటీ చేయాలని ప్రతిపాదించగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి జైపాల్‌రెడ్డి పూర్తిగా వ్యతిరేకించినట్లు సమాచారం.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.