యువత బలిదానాలు చేసుకోవద్దు: రాజ్‌నాథ్

తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ ఆపలేరని, తెలంగాణ ఏర్పాటయ్యే వరకు ఎవరూ బలిదానాలు చేసుకోవద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఇవాళ ఆయన నగరంలోని నిజాం కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆత్మగౌరవ సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం ఎవరి తరంకాదని తెలిపారు. ఈ సభలో బీజేపీలోకి నగరా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్టు రాజ్‌నాథ్ ప్రకటించారు. దీంతో సమితి బీజేపీలో విలీనమైట్టైంది.

బిల్లు పెడితే మద్దతిస్తాం: రాజ్‌నాథ్
పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెడితే మద్దతిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసైనా సరే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యతిరేక శక్తులతో బీజేపీ కలువబోదని ఆయన స్పష్టం చేశారు

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.