యువత ఆత్మహత్యలు చేసుకోవద్దు: నాగం

హైదరాబాద్: తెలంగాణ రాదేమోననే బెంగతో యువత ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌రెడ్డి కోరారు. కలిసి పోరాడుదాం..తెలంగాణ సాధిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఆత్మబలిదానాలకు కాంగ్రెస్‌పార్టీయే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.