యాంటీ రేప్ బిల్లుకు లోక్‌సభ ఓకే

jailఓటింగ్ అనంతరం ఆమోదించిన లోక్‌సభ
ఇక రేప్ నిందితులకు 20 ఏళ్ల జైలు.. గరిష్ఠంగా జీవితాంతం కారగారవాసమే
నేరాన్ని పునరావృతం చేస్తే మరణదండన
-ఓటింగ్ అనంతరం ఆమోదించిన లోక్‌సభ
– ఇక రేప్ నిందితులకు 20 ఏళ్ల జైలు
– గరిష్ఠంగా జీవితాంతం కారాగారవాసమే నేరాన్ని పునరావృతం చేస్తే మరణదండన
– శృంగార సమ్మతి వయస్సు 18 ఏళ్లు
న్యూఢిల్లీ, మార్చి 19: ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటన నేపథ్యంలో మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు ప్రతిపాదిస్తూ తీసుకువచ్చిన అత్యాచార నిరోధక బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. ఆరుగంటల పాటు ఏకధాటిగా చర్చ జరిగిన తర్వాత రాత్రి 8 గంటల సమయంలో బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా ఆమోదం లభించింది. అయితే ఓటింగ్ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆయన కుమారుడు రాహుల్‌గాంధీతోపాటు పెద్ద సంఖ్యలో మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు గైర్హాజరవడం తీవ్ర చర్చనీయాంశమైంది. విపక్ష సభ్యులు కూడా ఎక్కువగా లేకపోవడంతో బిల్లుకు ఆమోదం లభించింది.

అయితే యాసిడ్ దాడుల కారకులకు జీవితఖైదు విధించాలంటూ యూపీఏ మిత్రపక్షం ఎన్సీపీతోపాటు, పలు విపక్ష పార్టీలు పెట్టిన సవరణ తీర్మానాలు వీగిపోయాయి. మహిళలపై నేరాల నిరోధమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ బిల్లులో రేపిస్టులకు కనీసం యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని ప్రతిపాదించారు. ఈ శిక్షను నిందితుడి జీవితాంతం కొనసాగించే అవకాశం కల్పించారు. అత్యాచార కేసులో శిక్ష అనుభవించిన వ్యక్తి మరోసారి రేప్‌కు పాల్పడితే ఉరిశిక్ష విధించాలని స్పష్టచేశారు. యాసిడ్ దాడులు, స్టాకింగ్, వయరిజం వంటి నేరాలకు శిక్షను పెంచారు. శృంగార సమ్మతి వయసును 18 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే స్టాకింగ్‌ను బెయిలబుల్ నేరంగా మార్చారు. ఫిబ్రవరి 3ను రాష్ట్రపతి ఆమోదించిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తీసుకువచ్చారు. భారత శిక్షాస్మృతి, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, భారత ఆధారాల చట్టం, లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించే చట్టాలలో సవరణలు ప్రతిపాదిస్తూ ఈ బిల్లు తెచ్చారు. ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటనలో ఆరుగురు కీచకుల చేతిలో బలైన వైద్య విద్యార్థిని ఉద్దేశిస్తూ..

‘ధీరవనిత’ను గౌరవిద్దామంటూ కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదానికి అన్ని పార్టీల మద్దతును కోరారు. ‘‘ఇలాంటి ఆటవిక ఘటనలను సమాజం ఇక ఎంతమాత్రం సహించబోదన్న సుస్పష్టమైన, గట్టి సందేశాన్ని ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ఆయన పేర్కొన్నారు. చట్టంలోని లొసుగులను సరిచేసేందుకే ఈ బిల్లు తెచ్చినట్టు చెప్పారు. బిల్లుపై సభలో చర్చ సందర్భంగా వివిధ నిబంధనలపై పలు పార్టీలు సభ్యులు భిన్నాభివూపాయాలు వ్యక్తంచేశారు. బిల్లుపై చర్చను ప్రారంభించిన బీజేపీ సభ్యుడు భోళాసింగ్ మాట్లాడుతూ కేవలం చట్టాలు తీసుకురావడంతో మహిళల సమస్యలు తీరిపోవని, సమాజం ఆలోచనాధోరణి, సంస్కృతిని మార్చాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అయితే ఆడపిల్లల పుట్టిన రోజు వేడుకలను తల్లిదంవూడులు నిర్వహించుకోవద్దని, ఇందిరాగాంధీ పుట్టిరోజు వేడుకలు నిర్వహించుకోలేదని ఆయన పేర్కొనడంతో మహిళా సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సందీప్ దీక్షిత్ (కాంక్షిగెస్) మాట్లాడుతూ 17 ఏళ్ల బాలుడు.. 17 ఏళ్ల బాలికపై లైంగిక నేరానికి పాల్పడితే ఏమీ చేయాలన్నది బిల్లులో వివరించలేదని పేర్కొన్నారు. జేడీయూ నేత శరద్‌యాదవ్ మాట్లాడుతూ ఈ బిల్లుపై తన అభివూపాయాలు వ్యక్తంచేస్తే విమర్శలు వస్తాయన్న భయంతో ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మాట్లాడటంలేదని పేర్కొన్నారు.

దీంతో ములాయం స్పందిస్తూ.. తాను ఉద్దేశపూర్వకంగానే మౌనంగా ఉన్నట్టు చెప్పారు. తాజా బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. మగవారిని తప్పుడు కేసుల్లో ఇరికించడానికి బిల్లును పోలీసులు దుర్వినియోపరచవచ్చునని, కొత్త చట్టం అవసరం లేదన్నారు. తాను నిజం మాట్లాడితే సమస్య వస్తుందని, దేశంలో తగినన్ని చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ బిల్లులోని నిబంధనలు దుర్వియోగపరచకూడదని, త్వరగా చట్టాన్ని తీసుకురావాలని చర్చలో పాల్గొన్న పలువురు సభ్యులు డిమాండ్‌చేశారు. అనంతరం బిల్లుపై చర్చకు హోంమంత్రి షిండే సమాధానమిస్తూ.. మహిళలపై నేరాల నిరోధానికి కఠినమైన చట్టాన్ని తీసుకువస్తున్నట్టు చెప్పారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో మహిళా అధికారులను నియమించాలన్న విపక్ష సభ్యుల సూచనను ఆయన అంగీకరించారు. కాగా, శృంగార సమ్మతి, ఇతర అంశాలపై సోమవారం నాటి అఖిలపక్షం భేటీని షిండే ప్రస్తావించగా.. ‘అది ప్రత్యేక పార్టీల భేటీ’ మాత్రమే అని, ఏడు పార్టీలను దానికి పిలువలేదని బిజూ జనతా దళ్, టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తంచేశారు. దీంతో ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కానివ్వబోమని షిండే హామీఇచ్చారు.

బిల్లులోని కీలకాంశాలు
– బిల్లులో తొలిసారి యాసిడ్ దాడులను నిర్వచించారు. ఈ ఘటనలో బాధితురాలికి ఆత్మరక్షణ హక్కు కల్పించారు. యాసిడ్ దాడులకు పాల్పడే నిందితులకు కనీసం 10 ఏళ్ల శిక్ష విధించాలని ప్రతిపాదించారు. యాసిడ్ దాడుల వల్ల తీవ్రంగా గాయపడినా, యాసిడ్ దాడికి ప్రయత్నించినా వివిధ నేరాలు ప్రతిపాదించారు.
– అమ్మాయిలను వెంటాడి వేధించడం (స్టాకింగ్), రహస్యంగా శృంగార కార్యకలాపాలు, అశ్లీల దృశ్యాలు చిత్రీకరించడం, చూడటం (వయరిజం), లైంగిక వేధింపులు వంటి నేరాలను నిర్వచించి.. వివిధ శిక్షలను సూచించింది.
– బిల్లులో అత్యాచారం నిర్వచనాన్ని విస్తృతం చేశారు. తీవ్రమైన అత్యాచారాల పరిధిని పెంచి మరింత కఠినమైన శిక్షలను ప్రతిపాదించారు.
– శృంగార సమ్మతి వయసును 18 ఏళ్లు యథాతథం.
– అత్యాచార బాధితురాలు తాత్కాలికంగా, శాశ్వతంగా, శారీరకంగా, మానసికంగా వైకల్యానికి గురైతే, ఆమె నుంచి ప్రత్యేక ఎడ్యుకేటర్ ద్వారా మేజిస్ట్రేట్ వాంగ్మూలం సేకరించడానికి వీలుగా ఆధారాల చట్టంలో సవరణలు. ప్రొసీడింగ్స్‌ను వీడియోక్షిగఫీ చేసేందుకు అనుమతి.
– లైంగిక నేరాల బాధితులకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పవూతులు ఉచిత వైద్యం అందించాలి.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.