మోసం చేసినందుకే అవిశ్వాసం: హరీష్‌రావు

హైదరాబాద్: తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌పార్టీ మోసం చేసినందుకే ఆపార్టీపై తాము అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెడుతున్నామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణను ఇగిఇస్తం అగ ఇస్తం అని చెప్పి ప్రజలను కాంగ్రెస్‌నేతలు తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టి గద్దె దించేందుకు సిద్ధమయ్యామని వివరించారు. అంతేకాకుండా వివిధ అంశాల్లో కిరణ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తీరుపై విసుగు చెంది అవిశ్వాసం ప్రవేశపెట్టాలనుకునే పార్టీతు తమకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే, అవిశ్వాసంపై ఇంత వరకు తమతో ఏపార్టీ చర్చించలేదని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.