మోడీ సునామీలో..థర్డ్‌ఫ్రంట్ గల్లంతు

న్యూఢిల్లీ, మే 16: యూపీఏ, ఎన్డీఏ కూటములకు దూరంగా ఉంటూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుదామని కొండంత ఆశతో ఉన్న ప్రాంతీయ పార్టీలను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తుత్తునియలు చేశారు. ఇప్పటికే అనేక కలహాలున్నప్పటికీ ఎన్నికల ఫలితాల తర్వాత కలిసిపోదామనుకున్న చిన్న పార్టీల నేతలకు ఆ అవసరం లేకుండా చేశారు. మోడీ ప్రభంజనంలో అన్నాడీఎంకే, తణమూల్ కాంగ్రెస్ మినహా ప్రాంతీయ పార్టీలన్నీ కొట్టకుపోయాయి. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), ప్రతిపక్ష బహుజన్‌సమాజ్ పార్టీ (బీఎస్పీ) అడ్రస్ గల్లంతు కాగా, దేశవ్యాప్తంగా పోటీ చేసినా లెఫ్ట్ కూటమికి 2009 ఎన్నికల్లో లభించిన సీట్లలో సగమే దక్కాయి. ఎస్పీని ఏలుతున్న ములాయం కుటుంబసభ్యులు మాత్రమే ఈ ఎన్నికల్లో అతికష్టంమీద విజయం సాధించగా, బీఎస్పీ ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకొంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.