మోడీ.. మంత్ర..!

దేశాన్ని అభివద్ధి పథంలో నడిపించడానికి తనవద్ద సూత్రాలు ఉన్నాయని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ప్రకటించారు. పురాణాల్లో వేదాల్లో ఉన్న సంస్కత ధర్మ సూత్రాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వాటికి అర్థాలు వివరిస్తూ తాము అధికారంలోకి వస్తే ఈ సూత్రాలను ఏవిధంగా అమలుపరుస్తామో చెప్పారు. వాటిని మై ఐడియా ఆఫ్ ఇండియాగా పేర్కొన్నారు. అవి ఇలా ఉన్నాయి.
పైధోం మే పరమాత్మ దిక్‌నా.. మొక్కల్లో కూడా భగవంతుడిని దర్శించి, జీవహింసకు దూరంగా ఉండడం.
ఆనో భద్రాః క్రతవోయంతు విశ్వతః.. మంచి ఆలోచనలు ప్రపంచం నలుమూలలనుంచి స్వీకరించడం.
సర్వ పథ్ సమభావ్.. అన్ని రకాల ఆధ్యాత్మిక దారులు సమానమేననే భావనను కలిగిఉండడం.

న త్వహం కామయే రాజ్యం న స్వర్గః న పునర్భవం కామయే దుఃఖ తప్తానాం ప్రాణి నామార్తినాశనం.. రాజ్యాధికారాన్ని కానీ వస్తుసంపదను అనుభవించడం ద్వారా గానీ స్వర్గం చేరుకోవడం ద్వారా గానీ పునర్జన్మ లేకుండడంలోగానీ సంతోషం దొరకదు. సంతోషం అనేది తోటిప్రాణి కష్టాలను బాధలను తగ్గించడంలో దొరుకుతుంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.