మోడీ మంచి ప్రధాని అవుతారు-బీజేపీ ప్రధాని అభ్యర్థికి అద్వానీ కితాబు

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంవూదమోడీ ఉత్తమ ప్రధానమంత్రి అవుతారని ఆ పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ప్రస్తుతించారు. తనకు రాజకీ య భవిష్యత్తును అందించింది.. అద్వానీయేనని, ఆయ న లేకుంటే ఈ స్థానంలో ఉండేవాడినేకాదని నరేంవూదమోడీ కొనియాడారు. శనివారం గాంధీనగర్ లోక్‌సభ నియోజకర్గానికి అద్వానీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మోడీ అద్వానీకి తోడుగా ఉన్నారు. నా మినేషన్ అనంతరం బహిరంగసభలో వీరు పరస్ప రం ప్రశంసల్లో ముంచెత్తుకున్నారు. ‘నరేంవూదమోడీ నా శిష్యుడని నేనెప్పుడు చెప్పను. కానీ, ప్రభుత్వాన్ని నడిపించడం లో ఆయనంత గొప్ప కార్యనిర్వాహకుడు లేడు. మంచి ప్రధానిగా ఆయన నిరూపించుకుంటారు’ అని అద్వానీ పేర్కొన్నారు. అందువల్లనే పార్టీ ఆయనకు గురుతరమైన బాధ్యతలు అప్పగించిందన్నారు.

adwani
మోడీ మరుపురాని నాయకుడని బీజేపీలోనేకాదు.. ఆరెస్సెస్‌లోనూ నిరూపించుకున్నాడని తెలిపారు. వాజపేయితో మోడీ పొల్చబోనని చెబుతూ.. ‘వాజపేయి ప్రత్యేక తరగతికి చెందిన నా యకుడు. పార్టీ సిద్ధాంతకర్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విధానాలను అమలుచేశారు’ అని పేర్కొన్నారు. మధ్యవూపదేశ్‌లోని కొందరు మిత్రులు అక్కడినుంచి పోటీచేయాలని కోరారు.. కానీ, గాంధీనగర్‌ను విడిచి ఉద్దేశం ఎప్పుడూ తనకు లేదని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాల య గౌరవాన్ని తగ్గించినప్పుడే యూపీఏ పతనం ప్రారంభమైందని అద్వానీ అన్నారు. అనంతరం మోడీ మాట్లాడుతూ అద్వానీకి ఘనవిజయం సాధించేలా బీజేపీ శ్రేణు లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అద్వానీలాంటి రాజనీతిజ్ఞుడినుంచి మార్గదర్శకత్వంలో పనిచేసే అవకాశం లభించడం నిజంగా అదృష్టమని మోడీ పేర్కొన్నారు. అద్వానీ లేకపోతే.. నా రాజకీయ భవిష్యత్తు ఉండేదికాదన్నారు. ఆయనకోసం ఏం చేసినా తక్కువేనని అన్నారు. ఏ రాష్ట్రంలోనూ పది స్థానాలకు మించి కాంగ్రెస్‌కు దక్కే అవకాశం లేదని వెల్లడించారు. కాగా, అద్వానీ ఆస్తులు ఐదేళ్లలో రెట్టింపయ్యాయి. 2009 ఎన్నికల్లో తన ఆస్తి రూ3.5కోట్లుగా పేర్కొన్న అద్వానీ ప్రస్తుతం రూ.7కోట్లుగా ప్రకటించుకున్నారు.
This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.