మోడీ ప్రచారంలో వాజపేయి

గుజరాత్‌లో నరేంద్ర మోడీ ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మోడీ అందివచ్చే ఏ అవకాశమూ వదలకుండా ప్రచారం చేసుకుంటున్నారు. తాజాగా ఆయన ప్రచారం చిన్న పిల్లల స్కూలు బ్యాగులపైకీ చేరింది. అక్కడ ప్రభుత్వం పంపిణీ చేసే బ్యాగులపై, నోటు బుక్కులపై మాజీ ప్రధాని వాజపేయి, సీఎం నరేంద్రమోడీ బొమ్మలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ఒక్క వడోదరలోనే ఈ బొమ్మలున్న లక్ష నోటుబుక్కులు, నాలుగు వేలకు పైగా స్కూలు బ్యాగులను అధికారులు పంపిణీ చేశారు. ఈ ప్రచారమేంటని విద్యాధికారులను అడిగితే ‘స్కూళ్లకు తరలాలి’ అన్నది మాజీ వాజపేయి నినాదమని సీఎం మోడీ దాన్ని అవిక్షిశాంతంగా కృషి చేస్తూ ఆచరణలో పెడుతున్నారని చెప్పుకొచ్చారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.