మైక్ ఎత్తుకుపోయిన దానం

దానం దాదాగిరి ముదిరిపోయింది.  మైకులు గుంజుకుని జేబుల వేసుకుని పోయే స్థాయికి దిగజారిపోయిండు.   సర్దార్ వల్లభాయ్ పటేల్ 138వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి బీజేపీ నాయకులు గురువారం ఉదయం 9.30కి అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహం వద్దకు వచ్చారు. 10 గంటలకు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అక్కడికి చేరుకున్నారు. తొలుత పార్టీ గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్షుడు వెంకటడ్డి మాట్లాడారు. తరువాత దత్తావూతేయ మాట్లాడుతుండగానే మండలి చైర్మన్ చక్రపాణి అక్కడకు రావడంతో దత్తాత్రేయ తన చేతిలో ఉన్న మైకును అందించారు. చక్రపాణి తన ప్రసంగం ముగించి తిరిగి మైకును దత్తాత్రేయకు అందించారు. ఈలోగా మంత్రి దానం నాగేందర్ తన అనుచరులతో అక్కడి చేరుకొన్నరు.

బీజేపీ కార్యకర్తలు భారతమాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. సహనం కోల్పోయిన దానం దత్తాత్రేయ చేతిలోని మైకును తీసుకొని ‘జై కాంగ్రెస్, జై ఇందిరాగాంధీ, జై సోనియాగాంధీ, జై సర్దార్ పటేల్’ అంటూ తాను నినాదాలు ఇవ్వడంతో పాటు, అనుచరులతో నినాదాలు చేయించారు. ఆ తరువాత కేబుల్ తొలగించి మైకును జేబులో వేసుకొని కొంత దూరం వెళ్లి మైకును పక్కకు విసిరేశారు. ఆ వెంటనే దానం అనుచరుడు, పీసీసీ కార్యదర్శి బొట్టు వెంకన్న ఆ మైకును తీసుకొని వెళ్లిపోయారు. ఈ సంఘటనతో దత్తాత్రేయ బిత్తరబోయారు.  చేతిలోంచి మైకును లాక్కుని గూండాలా వ్యవహరించిన మంత్రి దానం నాగేందర్‌ను బర్తరఫ్ చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి ఎస్ ప్రకాశ్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.