మే 2న మెదక్ జిల్లా బంద్

 

kcrrr

బయ్యారం గనులను విశాఖ స్టీల్స్‌కు తరలించి తీరుతామని, ఏం చేసుకుంటారో చేసుకోండి అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మే 2న మెదక్ జిల్లా బంద్‌కు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. బయ్యారం గనుల విషయంలో సీఎం కిరణ్ తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా, అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. బయ్యారం గనులను తరలించి తీరుతామని సీఎం మెదక్ జిల్లా సంగాడ్డిలో జరిగిన సభలో మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మెదక్ జిల్లా బంద్‌తో ఉద్యమానికి శ్రీకారం చుట్టి మే నెలలో భూకంపాన్ని సృష్టిస్తామని ఆయన హెచ్చరించారు.

నైజాన్ని సీఎం మరోసారి చాటారు: టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత హరీష్‌రావు
బయ్యారం ఇనుప ఖనిజాన్ని విశాఖకు తరలిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అహంకారంతో మాట్లాడి సీమాంధ్ర నైజాన్ని మరోసారి చాటారని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నేత తన్నీరు హరీష్‌రావు మండిపడ్డారు. విశాఖకు ఇక్కడి ఖనిజాన్ని తరలిస్తామని చెప్పి సీఎం తెలంగాణ ప్రజలను కించపరిచేవిధంగా, రెచ్చగొ మాట్లాడుతున్నా అదే సభావేదికపై ఉన్న టీ మంత్రులు, టీ ఎమ్మెల్యేలు చప్పట్లు కొట్టడం చూస్తే సిగ్గేస్తోందని ఆయన సోమవారం ‘టీ మీడియా’తో అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో స్టీల్ ప్లాంట్ పెడతామన్న సాకుతో ఉన్న నాణ్యమైన ఇనుప ఖనిజాన్ని ఆంధ్రకు కొల్లగొట్టే కుట్ర ముఖ్యమంత్రి మాటలతో తేలిపోయిందని ఆయన అన్నారు. సకల జనుల సమ్మెతో నీకు జీతం రాని విషయాన్ని గుర్తు చేసుకోవాలని సీఎం కిరణ్‌కుమార్‌డ్డికి ఆయన సూచించారు. మళ్లీ చెబుతున్నాం.. బయ్యారం ఇనుప ఖనిజాన్ని తరలిస్తే భూకంపం సృష్టించడం ఖాయం అని ఆయన హెచ్చరించారు. ఇక్కడి ఇనుప ఖనిజాన్ని విశాఖకు తరలించం అని సీఎం స్పష్టత ఇస్తే, ఇక్కడే స్టీల్ ప్లాంట్‌ను పెడతామని ప్రకటిస్తే అభినందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

రాజుల పాలన కాదని గుర్తుంచుకోవాలి: జీ జగదీశ్వర్‌డ్డి
సంగాడ్డిలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన నియతృత్వ ధోరణికి నిదర్శనమని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి జీ జగదీశ్వర్‌డ్డి అన్నారు. ఇది రాజుల పాలన కాదన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల హక్కు బయ్యారం ఉక్కును ఎలా కాపాడుకోవాలో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణ ద్రోహి అనే విషయాన్ని సీఎం మరోసారి నిరూపించుకున్నారని టీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. బయ్యారం ఉక్కును బలవంతంగా సీమాంవూధకు తరలించుకుపోవటానికి అది సీఎం అబ్బసొత్తుకాదని మండిపడ్డారు. బయ్యారం ఉక్కును తరలిస్తే ఎంతకైనా తెగిస్తామన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.