మేలో కచ్చితంగా భూకంపం సృష్టిస్తం: హరీష్‌రావు

హైదరాబాద్: బయ్యారం గనుల వ్యవహారంలో సీఎం కిరణ్‌కు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సవాలు విసిరారు. ‘బయ్యారం ఉక్కును విశాఖ ఉక్కుకు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయను. ఏం చేస్తావో చేస్కో. భూకంపం సృష్టిస్తానన్నావుగా, సృష్టించుకో చూద్దాం. దాన్ని తట్టుకునే శక్తి మాకు ఉంది’ అని నిన్న సీఎం కిరణ్ టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కుకు బయ్యారం ఉక్కు గనులను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘సీఎం కిరణ్ మేలో కచ్చితంగా భూకంపం సృష్టిస్తాం. ఎలా ఆపుతావో ఆపుకో’ అని హరీష్‌రావు సవాలు విసిరారు.

సకల జనుల సమ్మె కాలంలో తన జీతం తెప్పించుకోలేని సీఎం రేపటి బయ్యారం భూకంపాన్ని ఎట్ల ఎదుర్కొంటాడని ఎద్దేవా చేశారు. బయ్యారం ఉక్కును జబర్దస్తిగా ఆంధ్రాకు తరలిస్తామని సీఎం కిరణ్ చెప్పినా తెలంగాణ మంత్రులు స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మంత్రులకు సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.