మేడారంలో భక్తజన కోలాహలం..

మేడారం జాతరకు ముందు గానే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ ను దర్శించుకునేందుకు ఆదివారం సుమారు 30 వేల మంది భక్తులు తరలివచ్చారు. వందలాది వాహనాల రాకపోకలతో జా తీయ రహదారి రద్దీగా మారింది. దీనికి తోడు ఆర్టీసీ అధికారులు సైతం సెలవుదినాల్లో మేడారానికి ప్రత్యేక బస్సులను నడుపుతు న్నారు. తరలివస్తున్న భక్తజన సందోహంతో గద్దెల ప్రాంగణం జన సందోహంగా మారింది. ఇప్పటికే గద్దెల ప్రాంగణం భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి.

50 శాతం పూర్తి కావస్తున్న అభివద్ధి పనులు..
జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సుమారు రూ.100 కోట్ల ని ధులతో చేపడుతున్న జాతర అభివద్ధి పనులు శరవేగంగా సాగు తున్నాయి. ఇప్పటి వరకు 50 శాతం పూర్తయినట్లు ఒక అంచనా. ఈనెలాఖరు వరకు పనులన్నీ పూర్త వుతాయని జిల్లా కలెక్టర్ జి. కిషన్ ఇప్పటికే ప్రకటిం చారు. ఆ దిశగానే శరవేగంగా పనులు సాగుతున్నా యి. జంపన్నవాగు నుంచి గద్దెల వరకు ఉన్న రోడ్డు ను నాలుగు లైన్ల రోడ్డుగా మార్చారు. ఆర్టీసీ బస్టాం డ్ అలైటింగ్ పాయింట్ గతంలో ఉన్న ప్రాంగణం నుంచి కొంచెం దూరం తాడ్వాయి వైపు జరిపి శివ రాంసాగర్ చెరువు ముందు భాగంలో ఏర్పాటు చేశారు. జాతర జరిగే ఆ నాలుగు రోజులు రోజుకు 50 లక్షల మంది భక్తులు తల్లులను దర్శనం చేసుకు నే విధంగా క్యూలైన్లను, చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ దుస్సా రాజేశ్వర్ ప్రకటించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.