మేం దద్దమ్మలం కాదు హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఊరుకోం: మంత్రి దానం

తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేస్తే ఒప్పుకునేది లేదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. యూటీ చేస్తే తాము చూస్తూ ఊరుకోవడానికి దద్దమ్మలంకాదని హెచ్చరించారు. ఢిల్లీ తాజా పరిణామాలు, హైదరాబాద్‌ను యూటీ చేయాలని సీమాంధ్ర కేంద్ర మంత్రుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో గురువారం తనను కలిసిన విలేకరులతో దానం మాట్లాడారు.

ప్రజావూపతినిధులు లేని యూటీని తాము అంగీకరించబోమన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరు సీమాంధ్ర నేతలు హైదరాబాద్‌ను యూటీ చేయాలని అంటున్నారని మండిపడ్డారు. అదే జరిగితే హైదరాబాద్ నగర ప్రజావూపతినిధులుగా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విభజన అనంతరం ఇక్కడ ఉంటున్న సీమాంధ్ర ప్రజల రక్షణ బాధ్యత తమదేనని, ఇది పార్టీ అధినేత్రి సోనియా మాటగా చెబుతున్నామని ఆయన వారికి భరోసా కల్పించారు.

-హైదరాబాద్ లేని తెలంగాణకు ఒప్పుకోం: ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్
హైదరాబాద్‌ను యూటీ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, తెలంగాణ ప్రజలు తిరగబడతారని సికింవూదాబాద్ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న 23వ ఆంధ్రకేసరి టైటిల్ కుస్తీ పోటీలను ప్రారంభించారు. అనంతరం టీ మీడియాతో మాట్లాడుతూ సీమాంవూధులు 60సంవత్సరాల నుంచి దోచుకున్నది చాలక మళ్లీ హైదరాబాద్‌ను యూటీ చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి జేడీ శీలంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు ఉద్యోగం చేస్తూ రాజ్యసభ సభ్యుడి హోదాలో కేంద్రమంత్రి పదవిపొందిన ఆయన ఇప్పుడు హైదరాబాద్‌ను యూటీ చేయాలని అనడం తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరచడమే అన్నారు. హైదరాబాద్ లేని తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. ఎంతోమంది అమరవీరుల త్యాగఫలమే ఈ నాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నారు.

తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్న తమ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇప్పటికైనా సీమాంధ్ర నాయకులు అన్నదమ్ములుగా విడిపోయి కలిసిమెలిసి ఉండేందుకు సహకరించాలని కోరారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.