మేం దంచుడు మొదలుపెడితే ఎవ్వడు మిగలడు

ఆంధ్రాలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు విఠల్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ స్వామి గౌడ్ అన్నారు. తాము దంచుడు మొదలుపెడితే ఎవ్వడూ మిగలరని హెచ్చరించిన్రు. సీమాంధ్రలో ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దన్నారు. తెలంగాణకు సక్రమంగా వచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, అక్రమంగా వచ్చిన వారు మాత్రం వెళ్లిపోవాల్సిందే అన్నారు. అలాంటి వారిని ఎలా పంపాలో తమకు తెలుసునన్నారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావిస్తే మూర్ఖత్వమన్నరు. చిన్నపిలుపిస్తే తెలంగాణలో ఏ ఒక్క అక్రమ ఉద్యోగి మిగలడని హెచ్చరించిన్రు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.