మూడేళ్ల సంబురమెందుకు? -హరీష్

ముఖ్యమంవూతిగా బాధ్యతలు చేప ట్టి మూడేళ్లయిందని కిరణ్‌కుమార్‌రెడ్డి సంబురాలు చేసుకుంటున్నరు! ఏదో ఘనత సాధించినట్లు పేపర్లలో, టీవీ ల్లో కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు గుప్పించిండు. దినదిన గండంగా సాగిన ఈ మూడేళ్ల కాలంలో ఆయననాయకత్వ పటిమ, రాజనీతిజ్ఞత, వ్యక్తిత్వంలోని డొల్లతనం బయట పడింది. సీల్డు కవర్ సీఎంగా వచ్చిన కిరణ్‌కుమార్ రెడ్డికి పార్టీలో అసమ్మతిని ఎదుర్కోవడానికి, సిఎం కుర్చీ ని కాపాడుకోవడానికి, జనానికి తనను పరిచయం కావడానికే సమయం సరిపోయింది. ఏదైనా అవకా శం దొరికితే తెలంగాణకు మరింత అన్యాయం చేయడానికే ఉపయోగించాడు. రాజకీయాల్లో ఓ రాష్ట్రానికి సీఎం కావడమనేది గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పార్టీలో, ప్రజల్లో మం చి పేరు సంపాదించి, ఓ శాశ్వత ముద్ర వేసుకోవ చ్చు. వ్యక్తిగతంగా కూడా ఎంతో పరిణతి చెందే అవకాశం, పాలనపై పట్టు సాధించే వెసులుబాటు ఉం టుంది. కానీ ముఖ్యమంత్రి అన్ని విధాలా తన పద వీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. రాజకీయంగా, పాలనాపరంగా, వ్యక్తిగతంగా కూడా కిరణ్ కుమార్‌రెడ్డి ఈ మూడేళ్ల కాలం లో ఎదగాల్సిందిపోయి, మరింత దిగజారిపోయా డు. రాజకీయంగా అట్టర్‌ఫ్లాప్ అయిండు. ముఖ్యమంవూతితో విభేదించి ఆరుగురు మంత్రులు కేబినెట్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. మరో ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది. దాదాపు 20మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అధికారపార్టీ నుంచి ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకు పోయిన చరిత్ర గతంలో ఏ పార్టీకి లేదు. కిరణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో 52 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. చివరికి సీఎం సొంత జిల్లా చిత్తూరులో కూడా గెలవలేదు.చిరంజీవి గెలిచిన తిరుపతి సీటును కూడా ఆయన నాయకత్వంలో ఓడిపోయారు.ఇప్పటికీ ముఖ్యమంత్రి సాంకేతికంగా పదవిలో కొనసాగుతున్నాడు. అసెంబ్లీలో కనీస మెజారిటీ లేదు. కేబినెట్లో సహచరుల మద్దతు లేదు. ఆయనకు పదవి ఇచ్చిన పార్టీ అండలేదు. 294మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వం మనుగడ సాగించాలంటే 148 మంది సభ్యులు కావాలి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంతమంది సభలో లేరు. ప్రతిపక్షమైన టీడీపీ కూడా సహకరించడం వల్ల మాత్రమే పదవిలోఉండగలుగుతున్నాడు. ఇప్పటికీ కేబినెట్ సహచరులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కిరణ్‌ను ముఖ్యమంవూతిగా అంగీకరించడం లేదు. ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్షికమంలో కూడా ఆయన పరువు పోతున్నది. నాడు ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎన్టీఆర్‌పై చెప్పులు వేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఫోటో ఉన్న ఫ్లెక్సీని కూడా పీకేస్తున్నారంటే, ముఖాన్ని కత్తిరించి సభలు పెట్టుకుంటున్నారంటే ఆయన పరువు ఉన్నట్టా? పోయినట్టా?

రాజకీయంగా ఘోర వైఫల్యం చెందిన కిరణ్ పరిపాలనలో కూడా చేతగానితనం నిరూపించుకున్నా డు. ఆయన తెచ్చిన ఏ కొత్త పథకమూ పట్టుమని ఏడాది కూడా నడవలేదు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నేనే తెచ్చిన అని కిరణ్ జబ్బలు చరుచుకుంటండు. బిల్లు పాస్ అయి, బడ్జెట్ కేటాయింపులు జరిగి నేటికి తొమ్మిది నెలలు పూర్తయింది. ఎస్టీ,ఎస్సీ సబ్‌ప్లాన్ కింద ఒక్క రూపాయైనా కేటాయించారా? ఒక్క దళితుడికైనా,గిరిజనుడికైనా మేలు కలిగిందా? ఈ బిల్లు రాకముందు కూడా ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్ ద్వారా కనీసం జిల్లాకు వందమందికి ఏదో ఓ సాయం అందేది. ఇప్పుడు అది కూడా అందలేదు. జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల నుంచి ప్రతిపాదనలు వచ్చి ముఖ్యమంత్రి ముందు మూల్గుతు న్నా, వాటికి మోక్షం రావడం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కాగానే ప్రారంభించిన కార్యక్షికమంరాజీవ్ యువకిరణాలు. రాజశేఖర్‌రెడ్డి.. ఆయన పేరు కలిసొచ్చేలా పెట్టుకున్న ఆర్.వై. ఎస్. పథకాన్ని కిరణ్ తన పేరు వచ్చేలా ‘రాజీవ్ యువకిరణాలు’ అని కొత్త పథకంగా ప్రకటించుకున్నాడు. కానీ ఆ పథకం ఏమైంది. ఎంతో హడావుడి చేసి, చివరికి వారు చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలను వారికే ఇప్పించి లెక్కలు రాసుకున్నా రు. ఈ పథకం కింద చూపించే సేల్స్ మెన్, వాచ్ మెన్, వాటర్‌మెన్, స్వీప ర్, క్లీనర్ ఉద్యోగాలు మాకు వద్దని యువకులు డీఆర్డీఏ కార్యాలయ మెట్లు ఎక్కడం మానేశారు. యువకిరణాల ద్వారా ఒక్క ఉద్యోగాన్నయినా కొత్త గా క్రియేట్ చేశారా? ‘ప్రజాసమస్యలకు తక్షణ పరిష్కారం కోసం రచ్చబండ’అని సీఎం గొప్పగా చెప్పుకున్నడు. కానీ రాష్ట్రవ్యాప్తంగా లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రచ్చబండ అంటే ఆశ తో మండల కార్యాలయాల చుట్టూ వేల మంది దరఖాస్తులు పట్టుకుని పెన్షన్ కావాలని,ఇండ్లు కావాలని, రేషన్ కార్డులు కావాలని తిరుగుతున్నారు. అంతెందుకు.. స్వయం గా సీఎం పాల్గొన్న రచ్చబండలో, ఆయన ఇచ్చిన హామీలకు కూడా ఇప్పటిదాకా దిక్కులేదు. తక్షణ పరిష్కారం అంటే ఇదేనా? రాజకీయ అవసరం కోసం రచ్చబండను వాడుకున్నాడే కానీ, ప్రజలకు దాని వల్ల మేలు కలుగలేదు. ఇప్పుడు అదే రచ్చబండ కార్యక్షికమం ఆయన రాజకీయ జీవితానికి సమాధి కట్టడానికి ఉపయోగపడుతోంది.

మంచినీరు, విద్యుత్, గృహనిర్మాణం, వ్యవసా యం లాంటి ప్రాధాన్యాంశాలను ప్రజల సమక్షంలో సమీక్షించడానికి పెట్టిన ‘ప్రజా పథం’ జరగక రెండే ళ్లు దాటింది. అంటే మీ ప్రభుత్వానికి ప్రజల మధ్యకు పోయే ధైర్యం లేన రైతులకు తొమ్మిది గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్ మానిఫెస్టో చెప్పింది. కానీ ఏ ఒక్క రోజు కూడా 9 గంటల విద్యుత్ అందలేదు. తెలంగాణ ప్రాంతంలో నాలుగైదు గంటల కరెంటు కూడా ఇవ్వలేదు. ఇందిరమ్మ పచ్చదనం పేరుతో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ, బంజరు భూముల్లో సాగు చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పారు. పేపర్లలో అడ్వర్టయిజ్ మెంట్లలో తప్ప ఎక్కడా ‘పచ్చదనం’ కనిపించడం లేదు. ఇందిరమ్మ అమృత హస్తం పేరుతో గర్భిణీలు, బాలింతలు, మూడేళ్ళ చిన్నారులకు పోషకాహారం అందిస్త్తామని చాటారు. గుడ్లు, పండ్లు, బియ్యం ఇస్తమన్నరు. ఎవరికిచ్చారు గుడ్లు? ఎవరికి తినిపించారు పండ్లు? ఎవరికి దక్కాయి బియ్యం? ఇట్ల ఏ పథకం తీసుకున్నా సరే, అన్నీ సగంలో ఆగిపోయినవే. కిరణ్ వచ్చిన తర్వాత పెట్టిన పథకాలు మాత్రమే కాదు. అంతకుముందునుంచీ నడుస్తున్న పథకాలకు కూడా కీడు పట్టుకున్నట్లుంది. ఫీజు రీ ఎంబర్స్ మెంటు రాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పోయినేడాది స్కాలర్ షిప్పులూ అందలేదు. ఓ క్రికెటర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండని క్రీడాకారులంతా సంబరపడ్డరు. కానీ కిరణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన రాష్ట్ర క్రికెట్‌కు ఎన్న డూ పట్టనంత దరిద్రం పట్టింది. ఎవరూ లేక ఒరిస్సా కు చెందిన ఓజాను మన క్రికెటర్‌గా చెప్పుకునే ఖర్మ పట్టిందిపాంతీయ వివక్షకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉద్యమం నడుస్తోంది. కిరణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనైనా వివక్షకు ఫుల్ స్టాప్ పెట్టి, అందరినీ సమంగా చూసే బాధ్యతను విస్మరించాడు. వివక్షలో ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డిలను కూడా మించిపోయిం డు . పోనీ సీమాంవూధకన్నా మేలు చేసిండా అంటే అదీ లేదు. సొంత జిల్లాకు మాత్రమే నిధులు మళ్లించుకుని తాను జిల్లా నాయకుడ్నే తప్ప ముఖ్యమంత్రి స్థాయి తనకు లేదు అని నిరూపించుకున్నడు. సహజ న్యాయ సూత్రాలను, రాజ్యాంగ ధర్మాలను, శాసనాలను, కోర్టు తీర్పులను, గత ఒప్పందాలను, ప్రభు త్వ ఉత్తర్వులను, దైవ సాక్షిగా చేసిన ప్రమాణాలను, మేనిఫెస్టెలో చేర్చిన హామీలను, ప్రజలకిచ్చిన వాగ్దానాలను విస్మరించి చరివూతలో చెరగని నల్లమరక అం టించుకున్నడు. పోలవరం ప్రాజెక్టు వల్ల సొంత భూమికి,ఇంటికి, నమ్ముకున్న అడవికి దూరమవుతున్న వారికిచ్చే పునరావాస ప్యాకేజీలోనూ వివక్షే. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎకరాకు రూ. 3.50 లక్షల పరిహారం చెల్లిస్తున్నారు. అదే ఖమ్మం జిల్లాలో గిరిజనులకు ఎకరాకు రూ. 1.15 లక్షలు చెల్లిస్తున్నారు. సంకరజాతి పాడి పశువుల శిక్షణ కేంద్రాన్ని చిత్తూరు జిల్లా కనికిరిలో పెట్టారు. మరో జెఎన్టీయు వస్తే దాన్ని కనికిరికి తన్నుకుపోయా రు. సైనిక్ స్కూల్ పెట్టడానికి కూడా కనికిరే దొరికింది. అదే చిత్తూరు జిల్లాలో రెండొ మెడికల్ కాలేజీ పెడుతున్నరు. బీబీ నగర్ నిమ్స్ పై వివక్ష. సింగరేణి కార్మికుల ఎక్స్ గ్రేషియాలో వివక్ష. కాకతీయ ఉత్సవాల నిర్వహణలో వివక్ష. ప్రకృతి వైపరీత్యాల నిధుల కేటాయింపులో వివక్ష. నష్టపరిహారం చెల్లింపులో వివక్ష. నల్లబెల్లం ధర నిర్ణయంలో వివక్ష. ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూన్స్, ముంపు ప్రాంతాల నష్టపరిహారం. . ఇలా తెలంగాణకో న్యాయం, సీమాంవూధకో న్యా యం చేసిండు ఈ ముఖ్యమంత్రి. తెలంగాణ వ్యాప్తంగా వరుసగా నాలుగేళ్లు వడగళ్ల వాన పడింది. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మేము ప్రభుత్వానికి అనేక వినతులు సమర్పించాం. అధికారులు సర్వేలు చేసి నివేదికలు పంపారు. కానీ ఒక్క రూపాయి సాయం రాలేదు. అదే ఆంధ్ర ప్రాం తంలో తుఫాన్లు వస్తున్నాయని వస్తున్నాయని ప్రతీ ఏడాది సాయం అందుతూనే ఉంది. తెలంగాణ పౌరులను మనుషులుగా కూడా గుర్తించరు.

గత ఏడాది రాష్ట్రంలో చాలా జిల్లాల్లో నీలం తుఫాను వచ్చింది. ఆంధ్రా ప్రాంతంలోని పది జిల్లాల్లో, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పంట నష్టం జరిగింది. కానీ ఆంధ్ర ప్రాంత పది జిల్లాల్లో హెక్టారుకు రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించారు. వరంగల్, ఖమ్మం రైతులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఒకే రాష్ట్రం, ఒకే సారి ఒకే రకమైన నష్టం. కానీ ఆంధ్ర రైతులకు న్యాయం, తెలంగాణ రైతులకు అన్యాయం జరిగింది. ఇది ప్రాంతీయ వివక్ష. మొన్నటికి మొన్న తుఫాను వస్తే ఆంధ్రలో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడి చేపలు పట్టుకునే వారి గురించి మాట్లాడారు. కోనసీమ కొబ్బరి రైతుల పరిహారం పెంచుతామని చెప్పారు. కానీ తెలంగాణలోని మక్క రైతుకు దిక్కులేదు, పత్తి గురించి మాట్లాడలేదు. నేటికీ రూపాయి పరిహారం రాలేదు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 10, 917 టీచర్ పోస్టు లు మంజూరయ్యాయి. అందులో 2,231 మంది టీచర్లను ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరుకే తీసుకుపోయారు. రాష్ట్రం మొత్తానికి 148 భాషా పండితుల పోస్టుల మంజూరైతే అన్ని పోస్టులను చిత్తూరు కే కేటాయించారు. మొత్తం 1,929 స్కూల్ అసిస్టెం ట్ పోస్టులు మంజూరయితే, అందులో చిత్తూరు కు 946 కేటాయించారు. అక్కడి అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికల ప్రకారం టీచర్లున్నా, విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్య చిత్తూరు జిల్లాలో 251 ఉన్నాయి. ఒక్కో బడిలో ఇద్దరు టీచర్లు మిగిలినా 500 టీచర్లు అవసరానికన్నా ఎక్కువ ఉన్నారు. ఇటువంటి వివక్షాపూరిత ముఖ్యమంత్రి నుంచి మూడేళ్లలోనే విముక్తి కావడం మాకు సంతోషంగా ఉంది. ఈయనను సీమాంధ్ర ప్రజలు భరిస్తరో, ఏమి చేస్తరో వాళ్ల అదృష్టం మీద ఆధారపడి ఉంటది. ఎలాగూ రాష్ట్ర విభజన జరుగుతుంది. రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంవూతులు వస్తారు. మధ్యలో మళ్లీ మార్చడమెందుకు అనుకుని కాంగ్రెస్ అధిష్టానం ఈయనను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న దని నేను భావిస్తున్నాను. పార్టీకి, ప్రజలకు ఉపయోగపడని మనిషిని ఎవరైనా ఎందుకు భరిస్తారు.

(వ్యాసకర్త టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత)

This entry was posted in ARTICLES.

Comments are closed.