మూడు కీలక పోస్టులు గెలుచుకున్న శైలేష్ రెడ్డి ప్యానల్

ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లో తెలంగానం మార్మోగింది. శైలేష్ రెడ్డి ప్యానల్ మూడు కీలక పదవులను గెలుచుకున్నది.  వైస్ ప్రెసిడెంట్,  సెక్రటరీ, ట్రెజరర్ పదవులను శైలేష్ రెడ్డి ప్యానల్ కైవసం చేసుకున్నది.  వర్కింగ్ జర్నలిస్ట్ ప్యానల్ అభ్యర్థి ప్రెసిడెంట్ గా  గెలిచిన్రు. కార్యవర్గ సభ్యులుగా కంబాలపల్లి క్రిష్ణ, మేకల కళ్యాణ్ చక్రవర్తి, శ్రీనివాస్, రఘు, గాయత్రి,  దశరథరెడ్డి ఎన్నికయిన్రు.

తెలంగాణ జర్నలిస్టులు ఐకాన్ గా భావించే శైలేష్ రెడ్డి తమ గెలుపు కోసం ఎంతో శ్రమపడ్డరని గెలుపొందిన అభ్యర్థులు చెప్తున్నరు.

ఒంటెత్తు పోకడలు పోయే ఏ సంఘమైనా (ఎప్పటికైనా) పరాభవం చెందక తప్పదు. గత కార్యవర్గంలాగా కొత్త కార్యవర్గం సమైక్యవాదుల సభలకు అనుమతివ్వదని ఆశిస్తున్నం.

ఈ ఎన్నికల్లో గెలిచిన తెలంగాణోళ్లకు కంగ్రాట్స్.. ఆంధ్రోళ్లకు కూడా..

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.