మూగబోయిన ‘తొలి’ గొంతు

1969 తెలంగాణ ఉద్యమకారుడు రవీంవూదనాథ్ కన్నుమూత -అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మంలోని స్వగృహంలో మృతి -భారీగా తరలివచ్చిన తెలంగాణవాదులు -ఆయన ఆమరణ దీక్షతోనే మొదలైన ఉద్యమం -44 ఏళ్ల కిందటే తెలంగాణ కోసం ఉద్యమగుమ్మాన పోరుకేక -చివరి క్షణాల్లోనూ తెలంగాణ కాంక్షే ఊపిరిగా..

ఖమ్మం, టీ మీడియా ప్రతినిధి: తెలంగాణ ఉద్యమానికి బీజం వేసిన తొలితరం నాయకుడు, ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆమరణ దీక్షకు దిగి ఉద్యమాన్ని తెలంగాణ వ్యాప్తంగా రగుల్కొలిపిన అన్నాబత్తుల రవీంవూదనాథ్ మంగళవారం తెల్లవారుజామున ఖమ్మంలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు.

కొద్దికాలంగా పక్షవాతంతో బాధపడుతున్న రవీంవూదనాథ్ వివిధ ఆస్పవూతుల్లో చికిత్స పొందారు. అయినా ఫలితం లేకపోయింది. ఆయనకు భార్య కోమలవల్లి, ఇద్దరు కుమారులు అశోక్ కుమార్, అజయ్‌కుమార్‌లున్నారు. రవీంవూదనాథ్ మరణవార్త విని జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయన ఉద్యమ సహచరులు, మిత్రులు, అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు. జిల్లా నలుమూలలనుంచి తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుని ఘనంగా నివాళులర్పించారు. 1947 ఆగస్టు 27న అన్నాబత్తుల కృష్ణారావు, సత్యవతిలకు జన్మించిన రవీంవూదనాథ్ ప్రాథమిక విద్యాభ్యాసం ఖమ్మంలోని మోమినాన్ పాఠశాలలో జరిగింది. మల్టీపర్సస్ స్కూల్‌లో ఇంటర్మీడియట్, ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు.అనంతరం హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చేసి ఖమ్మం కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు.
1982 నుంచి 2000 సంవత్సరం వరకు న్యాయవాదిగా పనిచేశారు. ఖమ్మం డిగ్రీ కళాశాలలో విద్యార్థిగా ఉన్ననాడే విద్యార్థుల సమస్యలపై ఉద్యమించిన రవీంవూదనాథ్ డిగ్రీ రెండవ సంవత్సరంలోకి వచ్చేసరికి జిల్లా స్టూడెంట్స్ యూనియన్‌కు నాయకుడి స్థాయికి ఎదిగారు. కళాశాలలకు, విద్యార్థులకు సంబంధించిన సమస్యల పోరాటంలో భాగంగా తెలంగాణ విద్యార్థులకు జిల్లా కళాశాలల్లోనే సీట్లు లభించకపోవడం ఆయన కంటపడింది. ఉద్యోగాల్లో వారికి జరుగుతున్న అన్యాయం కూడా ఆయన దృష్టికి వచ్చింది. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందులోని సింగరేణి గనుల్లో తెలంగాణ వారి సంఖ్య తక్కువ కాగా పాల్వంచ కేటీపీఎస్‌లో తెలంగాణ ఉద్యోగులే లేరని తెలుసుకుని విస్తుపోయారు. తర్వాత జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల గణాంకాలు పరిశీలించారు. ముల్కీ, నాన్‌ముల్కీ, బోగస్ ముల్కీల బాగోతం గమనించారు. బోగస్ ఉద్యోగులను ఏరివేయాల్సిన సర్కారు వారినే సమర్థించే పని చేస్తుండడంతో ఆరుగురు సభ్యుల ( కైలాస్‌నాథ్, కోలాహలం వెంక కవిరాజుమూర్తి, కొలిశెట్టి రాందాస్, నిమ్మల శంకర్‌రావు, రామస్వామి)తో కమిటీ వేశారు. జిల్లావ్యాప్తంగా ఏఏ కార్యాలయాల్లో ఎంతమంది సీమాంవూధులు తిష్ఠ వేశారో జాబితా తయారు చేసి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. న్యాయం అర్థించారు. వినతులు బుట్టపాలు అభ్యర్థనలు అవమానాలపాటు కావడంతో ఆగ్రహించి మహాత్మాగాంధీ స్ఫూర్థిగా ఖమ్మంలోని ఆయన విగ్రహం వద్దనే ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు.
‘తెలంగాణ హక్కుల సాధన’ పేరిట
ఖమ్మం పట్టణ నడిబొడ్డున జనవరి 8, 1969న ఆమరణ నిరాహార దీక్ష మొదలైంది. తెలంగాణ హక్కుల సాధన పేరిట ప్రారంభమైన ఈ దీక్షకు తొలినాడే రవీంవూదునికి మద్దతుగా విద్యార్థులు, మేధావులు పెద్దలు వెల్లువలా తరలివచ్చి మద్దతు ప్రకటించారు. రెండవరోజు దీక్షకు మద్దతుగా ఇచ్చిన విద్యాసంస్థల బంద్‌కు భారీ స్పందన లభించింది. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు.ఊరుఊరంతా జన సమువూదమైంది. దీక్షకు వస్తున్న ఆదరణ ఓర్వలేని ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. మూడవరోజు వివిధ పార్టీల నాయకులు శిబిరానికి చేరుకుని రాజకీయాలు ప్రారంభించారు. దీక్ష విరమించాలని ఒత్తిడి తీసుకువచ్చారు. రవీంవూదనాథ్ వెనక్కు తగ్గక పోవడంతో విద్యార్థి సంఘ నాయకులను గ్రూపులుగా విడగొట్టారు. ఆనాటి హోంమంత్రి జలగం వెంగళరావు ఒక ఎత్తుగడగా రవీంవూదనాథ్ దీక్ష విరమించాడని తప్పుడు ప్రచారం సాగించాడు.
దీనితో విద్యార్థుల ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సంతకాల సేకరణ ప్రారంభించి కుట్రలను తిప్పికొట్టారు. 9 రోజునుంచి రవీంవూదనాథ్ ఆరోగ్యం క్షీణించసాగింది. తల్లి కన్నీరు మున్నీరై దీక్ష విరమించాలని బతిమాలినా రవీంవూధనాథ్ చెక్కు చెదరలేదు. ఉస్మానియా విద్యార్థులు స్పందించి సర్కారుపై ఒత్తిడి తెచ్చారు. దీక్ష 14వ రోజున ఉస్మానియా విద్యార్థి సంఘ నాయకుడు సురేందర్‌డ్డి ప్రత్యేక దూతగా వచ్చి రవీంవూదనాథ్ డిమాండ్లపై ప్రభుత్వ సానుకూల స్పందనను తెలియజేసి దీక్షను విరమింపచేశారు. 14 రోజులపాటు సాగిన దీక్ష విరమణ అయితే జరిగింది కానీ ఆయన రగిల్చిన ఉద్యమవేడి చల్లారలేదు. ఖమ్మంలో పుట్టిన నిప్పురవ్వ మొత్తం తెలంగాణమంతా దావానలమై వ్యాపించింది. మహోగ్ర రూపం దాల్చి నాటి ఇందిర ప్రభుత్వాన్నే కదిలించింది. చరివూతాత్మక 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా చరిత్ర పుటల కెక్కింది.
చివరి వరకూ ఉద్యమించాలని చెప్పిన రవీంవూదనాథ్..
అనారోగ్యంతో బాధపడుతున్న రవీంవూదనాథ్ కొద్దిరోజుల కిందట ‘టీమీడియా ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు ఉద్యమం సాగించాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, ఈ వేడి తగ్గించొద్దన్నారు. బానిస బతుకులకు అలవాటు పడ్డ నాయకులను ఉద్యమంలోకి పిలవొద్దని చెప్పారు. ఉద్యమ సారధులుగా విద్యార్థులే ముందుండాలన్నారు. సకలజనుల సమ్మె, కేసీఆర్ దీక్ష ప్రభావం తెలంగాణ ఉద్యమంపై కీలక పాత్ర పోషించిందని, ప్రభుత్వానికి కళ్లు తెరిపించామని అన్నారు. 1969లో కూడా విద్యార్థులు, ఉద్యమకారులు, ఉద్యోగులే ప్రధాన భూమిక పోషించారని, వారి తిరుగుబాటుతోనే మళ్లీ ఉద్యమం తీవ్రతరమైందన్నారు. ఒక విద్యా సంవత్సరం నష్టపోయినా, ఉద్యోగులు జీతాలు కోల్పోయినా నిగ్రహంతో పోరాటం జరిపితే విజయం తథ్యమన్నారు.
తెలంగాణ కోసం పరితపించారు నాన్న తాను చనిపోయేనాటికైనావూపత్యేక రాష్ట్రం సిద్ధస్తుందని ఎంతో ఆశపడ్డారు. ఆరోగ్యం క్షీణించిన సమయంలో తెలంగాణ కోసం ఆరాటపడ్డారు. ‘నమస్తే తెలంగాణ’ పేపరోళ్లు వచ్చారు అంటే చాలు.. చాలా ఉత్సాహంగా కనిపించేవాడు. అమ్మ సహాయంతో అనేక విషయాలు చెప్పేవాడు. తెలంగాణ విమోచన దినం సందర్భంగా ఆరోగ్యం బాగా లేకున్నా ఖమ్మం కోర్టులో జరిగిన కార్యక్షికమానికి వెళ్లి జెండా ఎగరేశారు. మా నాన్న చనిపోయినా.. ఆయన ఆశయ సాధనకు మేం కట్టుబడే ఉంటాం.

– అన్నాబత్తుల అశోక్ (రవీంవూదనాథ్ కుమారుడు)

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.