హైదరాబాద్ పై ఆంక్షలంటే తెలంగాణ ప్రజలను అవమాన పర్చడమే-కేసీఆర్

హైదరాబాద్ పై ఆంక్షలు విధించడమంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని కేసీఆర్ అన్నరు.  ఉన్నత విద్యలో రెండు రాష్ట్రాలకు కామన్ ఎంట్రన్స్  పెట్టడం తెలంగాణ విద్యార్థులకు అన్యాయం చేయడమేనన్నరు. అప్పులను జనాభా ప్రాతిపదికన పంచడానికి ఒప్పుకునేదిలేదన్నరు.  హైదరాబాద్ లో రిటైర్డ్ అయిన ఆంధ్రా ఉద్యోగులకు పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం ఎలా ఇస్తదని కేసీఆర్ ప్రశ్నించిన్రు.

సోనియా, ప్రధాని, బీజేపీ, ఇతర పార్టీల నేతలకుధన్యావాదాలు: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీకి, ప్రధాని మన్మోహస్‌సింగ్‌కు, తెలంగాణకు సహకరిస్తున్ బీజేపీ, ఇతర పార్టీల నేతలకు టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.  హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసినందుకు ఇద్దరికి ధన్యావాదాలు తెలుపుతున్నానన్నారు. అదే విధంగా ముసాయిదా బిల్లుకు సహకరించిన బీజేపీ ఇతర పక్షాలకు కూడా తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ తానొక్కడి వల్ల సాధ్యంకాలేదని, ప్రజల సహకారం తోడైందని తెలిపారు.

అమరవీరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ : కేసీఆర్
తెలంగాణ అమరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అని స్పష్టం చేశారు. ఇపుడు ఏం 2001లో మొదలైన ఉద్యమం నిన్నటి దాకా తెలంగాణ అంతా ఒక్కటై ఉద్యమించిందని తెలిపారు. ‘నేను పక్కదారి పడితే రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన. సంబురాలకు కారణం కాదని చెప్పడానికి కారణం ఉంది. ఉద్యమ నాయకత్వం విశ్రాంతి తీసుకోవద్దు. నిన్నటిది ముసాయిదా బిల్లు మాత్రమే. ఇంకో ఘట్టం మిగిలి ఉంది. పార్లమెంట్‌లో బిల్లు పాసైన రోజు ప్రపంచంలో ఎవరూ జరుపుకోనంత సంబురాలు జరుపుకుందాం’ అని తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్, నీటిపారుదల రంగ నిపుణులతో బిల్లును అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు.

This entry was posted in CRIME NEWS, TELANGANA NEWS, Top Stories.

Comments are closed.