ముమ్మాటి్కీ ట్యాంక్ బండ్ మీద కూలిపోయినవి మట్టిబొమ్మలే-అసెంబ్లీలో గర్జించిన కేటీఆర్

తెలంగాణ టైగర్ కేటీఆర్ అసెంబ్లీలో గర్జించిండు. సీమాంధ్ర నేతల అబద్ధాలను పటా పంచలు చేస్తూ వాస్తవాలను అసెంబ్లీ రికార్డుల్లోకెక్కించిండు. కేటీఆర్ ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ట్యాంక్ బండ్ పై మట్టిబొమ్మలు కూలిపోతే బాధపడ్డ నేతలు… వందలాది మంది తెలంగాణ బిడ్డలు చనిపోతే ఒక్క కన్నీటి బొట్టు రాల్చలేదని కేటీఆర్ అన్నరు. కేటీఆర్ మట్టిబొమ్మలు అనడంపై టీడీపీ, సీమాంధ్ర కాంగ్రెష్ నేతలు రాద్ధాంతం చేసిన్రు. ొక్కసారి కాదు వందసార్లు అంటం.. క్షమాపణ చెప్పేదిలేదని.. ట్యాంక్ బండ్ పై కూలిపోయినవి మట్టిబొమ్మలేనని కేటీఆర్ మరోసారి పునరుద్ఘాటించిన్రు. బతికున్న వ్యక్తులకు సమాధులు కట్టిన వారి దగ్గరి నుంచి సంస్కారం నేర్చుకోవాల్సిన ఖర్మ పట్టలేదని ధీటుగా సమాధానం ఇచ్చిన్రు. 

అటు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఉద్యమంపై విషంచిమ్మిన సీమాంధ్ర నేతలకు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ దిమ్మదిరిగే కౌంటరిచ్చారు. వారు చెప్పిన చరిత్రంతా అబద్దాల పుట్టని స్పష్టంచేశారు. విలీనానికి ముందు హైదరాబాద్ రాష్ట్రంతో కలిసేందుకు సీమాంధ్రనేతలు ఎంత తహతహలాడారన్న దాన్ని చారిత్రక ఆధారాలతో బయటపెట్టారు. తెలంగాణ ఉద్యమం స్టేట్ ఫైటే కానీ.. స్ట్రీట్ ఫైట్ కాదన్న కేటీఆర్… సుదీర్ఘ పోరాటం తర్వాతే తెలంగాణ కల సాకారమైతుందన్నారు. ప్రజాశక్తి ముందు ఎంత గొప్ప శక్తైనా తలవంచక తప్పదన్నారు.

విలీనం నాటినుంచే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కేటీఆర్ ఫైరయ్యారు. తెలంగాణకు చెందాల్సిన వనరులను, ఉద్యోగాలను ఆంధ్రా ప్రాంతానికి అక్రమంగా కట్టబెట్టారని మండిపడ్డారు. ఆత్మగౌవరం కోసమే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. వెయ్యిమంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నా సీమాంధ్ర పాలకులకు కనబడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మద్రాసునుంచి వేరుపడేటప్పుడు సీమాంధ్ర నేతలకు దేశసమగ్రత గురించి గుర్తుకు రాలేదా అని కేటీఆర్ నిలదీశారు. ఏపీపీఎస్సీ ఉద్యోగాల్లో తెలంగాణ వారికి జరుగుతున్న అన్యాయాన్ని ఆధారాలతో అసెంబ్లీ ముందుంచారు కేటీఆర్.

తెలంగాణ తలరాత రాయడానికి సీమాంధ్రులెవరని కేటీఆర్ అసెంబ్లీలో నిలదీశారు. రాష్ట్ర ఏర్పాటుకు తాము వెయ్యి కారణాలు చూపిస్తామని.. సీమాంధ్రులు ఒక్కకారణం చెప్పగలరా అని ప్రశ్నించారు. సీమాంధ్రలో పైలిన్ తుఫాన్ బాధితులకు ఆఘమేఘాల మీద పరిహారం ఇచ్చిన.. ప్రభుత్వం తెలంగాణలో నీలం తుఫాన్ బాధితులను మాత్రం వదిలేసిందన్నారు. తెలంగాణ బిల్లును బోగిమంటల్లో వేసి సీమాంధ్రులు పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.