‘ముట్టడి’పై కట్టడి

– ‘చలో అసెంబ్లీ’పై ఖాకీల ఉక్కుపాదం

– వాహనదారులకు పోలీస్‌ల నోటీసులు
– కేసులు పెడుతామని హెచ్చరికలు
– ముందస్తు అరెస్టులకు రంగం సిద్ధం

చలో అసెంబ్లీపై ఉక్కుపాదం మోపడానికి ఖాకీ లు కసరత్తు చేస్తున్నారు. టీ జేఏసీ ఈనెల 14న తలపెట్టిన చలో అసెంబ్లీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందు కు కదులుతుండటంతో పోలీసులు దానిని భగ్నం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఎట్టిపరిస్థితిలో తెలంగాణవాదులు, విద్యార్థులు వరంగల్ జిల్లా సరిహద్దులు దాటకుండా ఉండేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఇందు లో భాగంగానే వాహనదారులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కార్లు, లారీ లు, డీసీఎంలు, విద్యాసంస్థల బస్సులు ‘చలో అసెంబ్లీ’కి పెట్టొద్దంటూ పోలీసులు మందుస్తు హెచ్చరికలు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యాసంస్థల యాజమాన్యాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. చలో అసెంబ్లీకి విద్యాసంస్థల బస్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

విద్యార్థులు ర్యాలీల్లో, ఆందోళనల్లో పాల్గొంటే విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని గతంలో పోలీసులు హెచ్చరికలు చేసిన మాదిరిగానే ప్రస్తుతం కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. జిల్లా సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికితోడు రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లలో పికెటింగ్‌లను ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు వెళ్లే వారిని అడ్డుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. గతంలో జేఏసీ పిలుపునకు స్పందించిన విద్యాసంస్థలను, ఇతర సంస్థలను గుర్తించిన పోలీసులు వారికి ముందస్తుగా హెచ్చరికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల ఎత్తుగడలను చిత్తుచేస్తూ చలో అసెంబ్లీకి తరలిరావాలంటూ ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్షికసీతోపాటు వివిధ సంస్థలు సన్నాహక సదస్సులు నిర్వహిస్తూ శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. పోలీసుల పద్మవ్యూహాలను ఛేదిస్తూ రాష్ట్ర రాజధానికి చేరుకోవాలని ఇప్పటికే జేఏసీ చైర్మన్ జిల్లాలో సదస్సులు నిర్వహించి శ్రేణులకు పిలుపునిచ్చారు. మరో రెండు రోజుల్లో చలో అసెంబ్లీ కార్యక్షికమం ఉండటంతో పోలీసులు దానిని భగ్నం చేసేందుకు ఎత్తులు వేస్తుండగా అదే స్థాయిలో రాజకీయ పార్టీలు ముందస్తు వ్యూహాలు రూపొందించుకుని కదులుతున్నారు.

notice1బైండోవర్లకు రంగం సిద్ధం
చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు పోలీసులు బైండోవర్ల అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో పలుమార్లు ఇదే పద్ధతిని అవలంబించిన పోలీసులు ఈ సారి కూడా తెలంగాణవాదులను, విద్యార్థి నేతలను ముందస్తు అరెస్టులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీస్ బాస్‌లు బైండోవర్ల జాబితాను సంబంధిత పోలీస్‌స్టేషన్లకు పంపించినట్లు సమాచారం. కాగా, పలుజిల్లాల్లో ఇప్పటికే బైండోవర్ల పర్వారికి ఖాకీలు తెరలేపి వందలాదిమందిని అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే వాహనదారులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. విద్యాసంస్థలతోపాటు లారీ ఓనర్స్ అసోసియేషన్, డీసీఎం ఓనర్స్ అసోసియేషన్, లైట్‌మోటార్ వెహికిల్స్ అసోసియేషన్‌లకు పోలీసులు చలో అసెంబ్లీకి వాహనాలను సమకూర్చవద్దంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆదేశాలను బేఖాతర్ చేస్తూ వాహనాలను ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

వాహనాలు సమకూరిస్తే క్రిమినల్ కేసులు
దుబ్బాక: చలో అసెంబ్లీకి వాహనాలు సమకూరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మెదక్ జిల్లా దుబ్బాక పోలీసులు వాహనదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. చలో అసెంబ్లీకి అనుమతి లేనందున వాహనాలు సమకూర్చరాదని దుబ్బాక పరిధిలోని సుమారు 35 మంది వాహనదారులకు డీసీఎం వ్యాన్లు, టాటా మ్యాజిక్, ఏస్, జీపులు, కార్ల యజమానులకు ఈ నోటీసులు జారీ చేస్తున్నారు. సోమవారం సాయంత్రం సంబంధిత వాహనాల యజమానులకు, డ్రైవర్లకు ఈ నోటీసులు జారీ చేస్తున్నారు. కార్యక్షికమానికి వెళితే డ్రైవర్లు, యజమానులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

jaitelanganaఇంటికిద్దరు తరలండి
– చలో అసెంబ్లీని విజయవంతం చేయండి
– ఆదిలాబాద్ తూర్పు జిల్లా జేఏసీ చైర్మన్ శంకర్
– జిల్లాలో ప్రారంభమైన జేఏసీ బస్సుయాత్ర
ఆదిలాబాద్ టౌన్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీకి ఇంటికి ఇద్దరి చొప్పున చేతిలో జెండాతో తరలిరావాలని ఆదిలాబాద్ తూర్పు జిల్లా జేఏసీ చైర్మన్ శంకర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. చలో అసెంబ్లీకి ప్రజలను సమాయత్తం చేయడానికి సోమవారం ఆదిలాబాద్‌లోని జేఏసీ శిబిరం నుంచి బస్సు యాత్రను ప్రారంభించారు. టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమాడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమన్న, టీఎన్‌జీవో అధ్యక్షుడు అశోక్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ర్యాలీగా వెళ్లి అమరవీరుల స్తూపం, తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. పలువురు జేఏసీ నేతలు మాట్లాడుతూ సీమాంవూధుల పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు.

అన్ని రంగాల్లో న్యాయం జరగాలంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే మార్గమన్నారు. ఎన్ని నిర్బంధాలు, బండోవర్లు, ముందస్తు అరెస్టులు చేసినా చలో అసెంబ్లీని విజయవంతం చేసి కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణ సత్తా చూపాలన్నారు. ఈ యాత్ర గుడిహత్నూర్, ఇచ్చోడ, బోథ్, బజార్‌హత్నూర్, ఇంద్ర ఉట్నూర్ వరకు సాగింది. కార్యక్షికమంలో జేఏసీ జిల్లా అధికార ప్రతినిధి కారింగుల దామోదర్, సీపీఎం నేతలు ప్రభాకర్‌డ్డి, కుంటాల రాములు, బీజేపీ నేతలు రావుల రాంనాథ్, దుర్గం రాజేశ్వర్, లాలామున్నా, దినేశ్‌మటోలియా, సంతోష్, టీఆర్‌ఎస్ నేతలు, రఫీక్, కస్తాల ప్రేమల, టీయూటీఎఫ్ నేతలు సాహెబ్‌రావ్ పవార్, రాంరెడ్డి, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు జాదవ్ కిరణ్ పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.