ముట్టడించి తీరుతాం-ఆంధ్రపాలకుల ఆట కట్టించి తీరుతాం

-పాలకులారా.. భేషజాలకు పోవద్దు.. హక్కులు కాలరాస్తే ఖబర్దార్ 

-తెలంగాణ రాజకీయ ప్రజా ప్రతినిధుల హెచ్చరిక
-అసెంబ్లీలో నేడు తెలంగాణపై వాయిదా తీర్మానం
– సభలో సమన్వయంతో పనిచేద్దాం.. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ నిర్ణయం
ప్రజాస్వామ్యబద్ధంగా, హింసకు తావులేకుండా ప్రకటించిన విధంగా ఈనెల 14న చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని నిర్వహించి తీరుతామని తెలంగాణ జేఏసీ ప్రకటించింది. ఈ విషయంలో భేషజాలకు పోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సోమవారం సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన రెండుగంటలపాటు జరిగిన రాజకీయ ప్రతినిధుల సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని విజయవం తం చేసేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ సమన్వయంతో పని చేయాలని సమావేశం నిర్ణయించింది. ఈ మూడురోజులపాటు శాసనసభ లోపల, వెలుపల ఈ మూడు రాజకీయపార్టీలు సమన్వయంతో పనిచేయాలని, పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు వీలుగా రాష్ట్ర శాసనసభలో తెలంగాణపై ఏకక్షిగీవ తీర్మానం చేయాలని కోరుతూ మంగళవారం సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.

చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం నిర్బంధకాండను కొనసాగించటం, బైండోవర్ కేసులు నమోదు చేయటం, పార్టీల నాయకులను బెదిరింపులకు గురిచేయటం పట్ల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. గొప్ప ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మన దేశంలో పోలీసులు పౌరహక్కులను హరించే విధంగా నిర్బంధం అమలు చేస్తే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని నిలదీసింది. ఇక్కడ నియంతృత్వానికి ఆస్కారం లేదని, రాచరికం అంతకన్నా కాదని పేర్కొంది. ‘ప్రజాస్వామ్యంలో మీకు (అధికారపార్టీకి) ప్రజలు ఎలా ఓట్లు వేశారో, మాకూ (విపక్షాలకు) అలాగే ఓట్లు వేశారు. ప్రజల ఆకాంక్షలను పాలకుల ముందు వ్యక్తపరిచేందుకు ప్రభుత్వం అనుమతించకపోగా.. చలో అసెంబ్లీకి తాము అనుమతించబోమని సీనియర్ పోలీసు అధికారి బహిరంగంగా ప్రకటించడం విచారకరం’ అని సమావేశం అభివూపాయపడింది.

తెలంగాణ రాజకీయ ప్రతినిధుల సమావేశానికి టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్, సీపీఐ పక్ష నేత గుండా మల్లేష్, బీజేపీ పక్ష నేత యెండెల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌డ్డి, హరీశ్వర్‌డ్డి, ఎస్ వేణుగోపాలాచారి, టీ హరీశ్‌రావు, అరవింద్‌డ్డి, ఎన్నెం శ్రీనివాస్‌డ్డి, రవీందర్‌డ్డి, కూనంనేని సాంబశివరావు, చంద్రావతి, ఉజ్జిని యాదగిరిరావు, టీ రాజయ్య, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌డ్డి, చంద్రశేఖర్, జనార్దన్‌డ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటడ్డి, జేఏసీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, మల్లేపల్లి లక్ష్మయ్య, విఠల్, అద్దంకి దయాకర్, హమీద్ మహ్మద్ ఖాన్, రసమయి బాలకిషన్, సీపీఐ ఎంఎల్-న్యూడెమోక్షికసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోవర్ధన్, బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నేత అశోక్‌కుమార్‌యాదవ్ తదితరులు హాజరయ్యారు. అనంతరం పలువురు నాయకులు మీడియాతో మాట్లాడారు.

స్థానిక ఎన్నికల్లోనే కాంగ్రెస్‌కు గుణపాఠం : గుండా మల్లేశ్ 
దేశంలోనే ఎక్కడా జరగని పోరాటాలు తెలంగాణలో జరిగాయని గుండామల్లేశ్ చెప్పారు. మరో ఏడు నెలల్లో ఎన్నికల వాతావరణం రానున్న నేపథ్యంలో మరొకసారి మన ఐక్యతను చూపించడానికి, కేంద్రాన్ని ప్రభావితం చేయడానికి చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈనెల 14న జరిగే చలో అసెంబ్లీ కార్యక్షికమంలో సీపీఐ పార్టీ తరుఫున పది వేలకు పైగా కార్యకర్తలు హాజరయ్యే విధంగా సమాయత్తం చేస్తున్నట్లు చెప్పారు. పోలీసుల నిర్బంధకాండ కొత్తేమీ కాదని అన్నారు. ఐక్యంగా ఉంటే తెలంగాణ సాధిస్తామని, అందుకు రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు. కాంగ్రెస్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి ఒక్క సీటు రాకుండా వ్యూహరచన చేసి కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని తెలంగాణ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం ఇకపై మూడు పార్టీలు అసెంబ్లీలోపల, బయట ఐక్యంగా ఉద్యమిస్తాయని మల్లేశ్ తెలిపారు.

వాయిదా తీర్మానం పెడతాం ః ఈటెల రాజేందర్ 
గత పన్నెండేళ్లుగా జరిగిన తెలంగాణ ఉద్యమం, గత మూడేళ్ళుగా జరుగుతున్న జేఏసీ ఉద్యమం ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని ఈటెల రాజేందర్ అన్నారు. ఎక్కడా హింసకు తావులేకుండా, ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు. కొన్ని సంఘటనలు జరగడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. తెలంగాణలోని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని అనుమతించకపోగా పోలీసు ఉన్నతాధికారి హెచ్చరించడం సహేతుకం కాదని అన్నారు. జిల్లాల్లో ప్రజలను భయవూభాంతుల్ని చేసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, హైదరాబాద్‌కు ప్రజల్ని తరలిస్తారన్న నెపంతో తెలంగాణ జిల్లాల్లోని రవాణా వ్యవస్థకు సంబంధించిన వారందర్నీ పోలీసు స్టేషన్లకు పిలిపించుకుని బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ తాము మంగళవారం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు హరీశ్ చెప్పారు. చలో అసెంబ్లీ కార్యక్షికమానికి అనుమతించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డిని మధ్యాహ్నం స్వయంగా కలుసుకుని విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఈనెల 12నాటికి కూడా ప్రభుత్వంనుంచి అనుమతి రాకపోతే కచ్చితంగా అసెంబ్లీని అడ్డుకుని, అనుమతి కోసం పట్టుబడతామన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారులు భేషజాలకు పోయి తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తే ఖబర్దార్ అని ఈటెల హెచ్చరించారు. శాంతియుతంగా చలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.

తెలంగాణవాదులను అడ్డుకోజాలరు : యెండెల లక్ష్మీనారాయణ 
తెలంగాణవాదులు తలపెట్టిన ఏ ఒక్క కార్యక్షికమాన్నీ సర్కారు అడ్డుకోజాలదని యెండెల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఇందుకు గత అనుభవాలే నిదర్శనమన్నారు. టీజేఏసీ నిర్ణయానికి బీజేపీ పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు.

వెనుకడుగు వేసేది లేదు : కోదండరాం 
రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి అణచివేత చర్యలకు పాల్పడినా, నిర్బంధాలు అమలుచేసినా చలో అసెంబ్లీ కార్యక్షికమంపై వెనుకడుగు వేసేది లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని జేఏసీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి కార్యక్షికమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం లేనిపోని ఆటంకాలు సృష్టించడం వల్లే తెలంగాణ ఉద్యమాలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయని అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్షికమానికి అనుమతి కోసం ముఖ్యమంవూతిని, అవసరమైతే గవర్నర్‌ను కలుసుకుంటామని చెప్పారు. జేఏసీ నేత మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ నిరసన తెలిపే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. తాము ఎల్లవేళలా శాంతికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.

దరఖాస్తు ఇచ్చినా ఎలాంటి అనుమతి అడగలేదని పోలీసు కమిషనర్ అబద్ధం చెబుతున్నారని విమర్శించారు. చలో అసెంబ్లీ కార్యక్షికమంలో టీడీపీ నేతలు భాగస్వాములైతే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. తెలంగాణ అడ్వకేట్ల జేఏసీ చైర్మన్ రాజేందర్‌డ్డి మాట్లాడుతూ చలో అసెంబ్లీ కార్యక్షికమానికి సంబంధించి తమకు దరఖాస్తు అందలేదని నగర పోలీస్ కమిషనర్ ప్రకటించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అడ్వకేట్ రాములు పేరుతో చలో అసెంబ్లీ కార్యక్షికమం, ఆ తర్వాత ఇందిరాపార్కు వద్ద ధర్నాకు అనుమతించాలని ఈ నెల 6న దరఖాస్తు చేసినట్లు చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.